Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PLI Scheme: ఇకపై చైనా బొమ్మలకు చెక్.. దేశవాళీ బొమ్మల ఉత్పత్తికి కేంద్రం సరికొత్త స్కీం..!

దేశ భవిష్యత్ కు పట్టుగొమ్మలైన పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాపై ఆర్ధిక మూలాలపై పరోక్ష దాడి చేయనుంది. చౌకైన చైనీస్ బొమ్మలను (ఇండియాలో చైనీస్ బొమ్మలు) భారత మార్కెట్ లో వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోనుంది.

PLI Scheme: ఇకపై చైనా బొమ్మలకు చెక్.. దేశవాళీ బొమ్మల ఉత్పత్తికి కేంద్రం సరికొత్త స్కీం..!
Pli Scheme In India
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2023 | 6:39 PM

భారత దేశం అతిపెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు భారత్ లో తమ వస్తువులను మార్కెట్ చేసుకోవాలని భావిస్తాయి.. ముఖ్యంగా మనదేశంలో ఎక్కువగా కంపించేవి చైనా వస్తువులు.. ఖరీదైన వస్తువులే కాదు.. అతి చౌకైన వస్తువులు కూడా భారత దేశంలో దర్శనమిస్తాయి. స్మార్ట్ ఫోన్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బాణాసంచా, దీపాలు అనేక రకాల చైనా వస్తువులు మార్కెట్ లో భారీ అమ్ముడవుతున్నాయి. అయితే చౌకైన చైనీస్ బొమ్మలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఎప్పటినుంచో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో గతంలో మోడీ ప్రభుత్వం చైనా బొమ్మలు దిగుమతి,  నాణ్యతకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

దేశ భవిష్యత్ కు పట్టుగొమ్మలైన పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాపై ఆర్ధిక మూలాలపై పరోక్ష దాడి చేయనుంది. చౌకైన చైనీస్ బొమ్మలను (ఇండియాలో చైనీస్ బొమ్మలు) భారత మార్కెట్ లో వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోనుంది. ఓ వైపు చైనా బొమ్మల నాణ్యతపై కఠిన మైన నిబంధనలు అమలు చేస్తూ.. మరోవైపు దేశవాళీ బొమ్మల ఉత్పత్తిని పెంచే విధంగా ప్రణాళికలను రెడీ చేసింది. దేశవాళీ బొమ్మల ఉత్పత్తిని పెంచేందుకు రూ.3500 కోట్లతో భారీ పథకం సిద్ధం చేసింది.

దేశంలో బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ. 3,500 కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని తీసుకువస్తోంది. ఇందుకోసం ఇప్పటికే క్యాబినెట్ నోట్ కూడా సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

అన్ని రకాల బొమ్మలు తయారు చేసే విధంగా.. చైనీస్ బొమ్మలు చౌకగా ఉండటం వల్ల నాణ్యత తక్కువగా ఉంది. అందువల్ల.. దేశంలో వాటి దిగుమతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతా ప్రమాణాలను తీసుకువచ్చింది. అదే సమయంలో..  PLI పథకం అమలు చేయాలనీ భావిస్తోంది. దీంతో దేశంలో  బొమ్మల ఉత్పత్తి పెరుగుతుందని.. నాణ్యమైన బొమ్మలు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..