AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridal Makeup: బ్యూటీ పార్లర్‌లో మేకప్‌తో కాలిన ముఖం.. పెళ్లి వద్దంటూ రద్దు చేసుకున్న వరుడు

ఓ నవ వధువు పెళ్ళికి ముందు బ్యూటీ పార్లర్ కు వెళ్లడంతో.. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఆ యువతి .. ఆస్పత్రి పాలైంది. పైగా వరుడు నాకు ఈ అమ్మాయి వద్దు.. ఈ పెళ్లి వద్దు అంటూ ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నాడు.

Bridal Makeup: బ్యూటీ పార్లర్‌లో మేకప్‌తో కాలిన ముఖం.. పెళ్లి వద్దంటూ రద్దు చేసుకున్న వరుడు
Wedding Call Off
Surya Kala
|

Updated on: Mar 04, 2023 | 9:42 AM

Share

భారతీయ సంప్రదాయంలో పెళ్లంటే.. ఇద్దరు వ్యక్తులను కలిపే బంధం మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య జరిగే ఓ వేడుక.  పెళ్లి కుదిరింది మొదలు.. పెళ్లికి ధరించే దుస్తులు, నగలు , మేకప్ నుంచి అన్నింటిపై వధూవరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తమకు నచ్చిన మెచ్చిన వాటిని పెళ్లి వేడుక కోసం ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఇక వధూవరులు వివాహం సమయంలో అత్యంత అందంగా కనిపించాలని భావిస్తూ ఇప్పుడు బ్యూటీ పార్లర్ లను ఆశ్రయిస్తున్నారు. బ్రైడల్ మేకప్ పేరుతో అందిస్తున్న ప్రత్యేక అలంకరణపై ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా ఓ  వధువు రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్‌ కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్‌కు వెళ్లింది. బ్యుటీషియన్‌ ఆమె ముఖానికి అప్లయ్‌చేసిన ఫేస్‌మాస్క్‌ వికటించింది. దీంతో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఆ యువతి .. ఆస్పత్రి పాలైంది. పైగా వరుడు నాకు ఈ అమ్మాయి వద్దు.. ఈ పెళ్లి వద్దు అంటూ ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె గ్రామంలో ఓ యువతి పెళ్ళికి రెండు రోజుల ముందు మేకోవర్ చేయించుకోవాలని భావించింది. అందుకోసం స్థానిక బ్యూటీ పార్లర్‌కు వెళ్ళింది. అక్కడ యువతికి మేకప్ లో భాగంగా ఫౌండేషన్ అప్లై చేయడానికి ముందు.. యువతికి ముఖానికి ఆవిరి పట్టించారు బ్యూటీ పార్లర్ సిబ్బంది. ఈ సమయంలో యువతి ముఖం కాలిపోయి వాచిపోయింది. నల్లగా మారిపోయింది. వరుడు .. తనకు కాబోయే వధువు ముఖం చూసి.. తనకు ఈ పెళ్లి వద్దు అంటూ రద్దు చేసుకున్నాడు. దీంతో పెళ్లికూతురు తల్లిదండ్రులు.. బ్యూటీ పార్లర్ యజమాని గంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..