Amazon Pay: ‘అమెజాన్ పే’కు భారీ పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ.. కారణాలు ఏమిటంటే..?
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిబంధనలను అమెజాన్ పాటించనందున అమెజాన్ పే ఇండియాపై 3.06 కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తూ..
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌కు చెందిన ఆమెజాన్ పేపై బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3 కోట్లకు పైగా జరిమానా విధించింది. కంపెనీ కేవైసీ నిబంధనలను పాటించడకపోవడమే ఇందుకు కారణమని ఆర్‌బీఐ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(పీపీఐ) నిబంధనలను అమెజాన్ పాటించనందున అమెజాన్ పే ఇండియాపై 3.06 కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. పీపీఐకి సంబంధించి జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్, కేవైసీకి సంబంధించి ఫిబ్రవరి 25, 2016న జారీ చేసిన నిబంధనలను అమెజాన్ పే కంపెనీ పాటించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఇంకా కస్టమర్ల పేమెంట్ ట్రాన్సాక్షన్స్‌లోని లోపాలకు సంబంధించి కాదని ఆర్బీఐ వివరణ ఇవ్వడంతో పాటు కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
#RBI imposes Rs 3.06 crore penalty on #AmazonPay India for violation of normshttps://t.co/x6IdGr2BCS pic.twitter.com/TRgFL4p20N
ఇవి కూడా చదవండి— Business Insider India?? (@BiIndia) March 3, 2023
అమెజాన్ పే ఇండియా ప్రతిస్పందన తర్వాత.. కంపెనీకి వ్యతిరేకంగా నిబంధనలను విస్మరించిన విషయం సరైనదని తేలిందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆ తరువాత ఆ సంస్థపై జరిమానా విధించాలని నిర్ణయించుకున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. చెల్లింపు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 30 కింద పొందిన హక్కుల ఆధారంగా అమెజాన్‌పై పెనాల్టీని ఆర్‌బీఐ విధించింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాన్ని గుర్తించిన తర్వాత చర్యలు తీసుకుంది. ఈ జరిమానాకు అమెజాన్ పే ఇండియా తన కస్టమర్‌లతో చేసిన ఒప్పందం లేదా లావాదేవీ చెల్లుబాటుతో సంబంధం లేదని ఆర్‌బీఐ తెలిపింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..