AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: టీమిండియా ఓటమిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు.. ‘పిచ్‌కు తలవంచారు’ అంటూ..

టీమిండియా చవిచూసిన ఈ పరాజయం మీద మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. టీమిండియా ఇండోర్ పిచ్‌కు తలవంచిందని మూడో టెస్టు ముగిసిన..

IND vs AUS: టీమిండియా ఓటమిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు.. ‘పిచ్‌కు తలవంచారు’ అంటూ..
Sunil Gavaskar On Indore Test
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 04, 2023 | 8:00 AM

Share

స్వదేశంలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఏ క్రీడా జట్టు అయినా భావిస్తుంది. అది సర్వసాధారణమైన విషయం. ఇంకా చెప్పాలంటే టీమిండియా కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే మన దేశంలో ఆడేందుకు వచ్చే ప్రతి జట్టును స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లతో బోల్తా కొట్టిస్తుంది. అయితే అదే స్పిన్ పిచ్‌పై తానే బోల్తా పడటం మాత్రం చాలా అరుదుగా జరిగే ఘటన. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ముగిసిన ఇండోర్ టెస్టులో కూడా ఇదే జరిగింది. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న ఇండోర్ పిచ్‌పై.. టీమిండియా టాస్ కూడా గెలిచింది. అయినా కూడా మూడు రోజుల్లోనే ఇండియాను ఆస్ట్రేలియా ఓడించగలిగింది.

అయితే టీమిండియా చవిచూసిన ఈ పరాజయం మీద మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. టీమిండియా ఇండోర్ పిచ్‌కు తలవంచిందని మూడో టెస్టు ముగిసిన తర్వాత సన్నీ అన్నారు. ఇక ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా ఆధిక్యాన్ని 2-1 గా తగ్గించగలిగింది ఆసీస్ జట్టు.

సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..? 

‘తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ వాళ్లు(ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు) పరుగులు చేయలేకపోయారు. నాగ్‌పూర్‌లో రోహిత్ శర్మ మినహా మిగతా ఎవరూ రన్స్ చేయలేదు. పరుగులు సాధించలేని సమయాల్లో బ్యాటింగ్‌లో సరైన ఆత్మ విశ్వాసం కనిపించదు. టీమిండియా బ్యాటర్ల మెదళ్లను పిచ్ చాలా ప్రభావితం చేసింది. ఏ పిచ్‌పై కూడా వాళ్లు సరిపడా పరుగులు చేయలేదు. పిచ్‌పై కాస్త ముందుకు వచ్చి ఆడాల్సి ఉన్నా అలా చేయలేకపోయారు. పిచ్‌కు తలవంచారు. ఎంతసేపూ వాళ్లు పిచ్ గురించే ఆలోచించారు. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇది మరింత ఎక్కువగా కనిపించింది’ అని గవాస్కర్ అన్నారు. ఇక ఈ  ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 109, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. మరోవైపు తన తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి 88 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అక్కడే సగం మ్యాచ్ గెలిచేసింది. అనంతరం 73 పరుగుల లక్ష్యంతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సిరీస్‌లో తన మొదటి విజయం నమోదు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ పిచ్‌పై కష్టమే: మంజ్రేకర్

సునీల్ గవాస్కర్ మాత్రమే కాక.. మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇండోర్ టెస్ట్ ఓటమిపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లపై ఫామ్‌లో లేని బ్యాటర్లు తిరిగి ఫామ్‌లోకి రావడం కష్టమే అని అన్నాడు. ‘ముందుగా మనందరం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే.. సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లో బౌలింగ్ ఆధిపత్యమే కొనసాగింది. సిరీస్ మొత్తం బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులే ఎదురయ్యాయి. ఫామ్‌లో లేకుండా సిరీస్‌లో అడుగుపెడితే.. ఇలాంటి పిచ్‌లపై తిరిగి ఫామ్‌లోకి రావడం కష్టం. విరాట్ కోహ్లి వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. ఫామ్‌లోకి తిరిగి రావడానికి అది చాలు’ అని మంజ్రేకర్ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..