AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records : ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సిక్స్.. 18 ఏళ్లుగా చెక్కుచెదరని ఆల్బీ మోర్కెల్ రికార్డు

IPL Records : ఐపీఎల్ చరిత్రలో ఆల్బీ మోర్కెల్ 125 మీటర్లతో అత్యంత పొడవైన సిక్సర్ రికార్డును కలిగి ఉన్నారు. గిల్ క్రిస్ట్, ధోనీ, గేల్ వంటి దిగ్గజాలు తర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ హిట్టర్లు మళ్ళీ 125 మీటర్ల మార్కును చేరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

IPL Records : ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సిక్స్.. 18 ఏళ్లుగా చెక్కుచెదరని ఆల్బీ మోర్కెల్ రికార్డు
Ipl Longest Sixes
Rakesh
|

Updated on: Mar 17, 2026 | 6:53 AM

Share

IPL Records : ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల విందు.. బ్యాటర్లు విరుచుకుపడుతుంటే స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు ఆకాశాన్ని తాకుతాయి. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పొడవైన సిక్సర్ ఎవరైనా కొట్టారా అంటే చాలామంది క్రిస్ గేల్ లేదా ఎంఎస్ ధోనీ పేర్లు చెబుతారు. కానీ వారిద్దరూ కాదు. గత 18 ఏళ్లుగా ఎవరూ బద్ధలు కొట్టలేని ఆ భారీ సిక్సర్ రికార్డు ఒక ఆల్ రౌండర్ పేరిట ఉంది. అతనే సౌతాఫ్రికా ఆటగాడు ఆల్బీ మోర్కెల్. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అతను ఏకంగా 125 మీటర్ల పొడవైన సిక్సర్ బాది చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఎంతోమంది పవర్ హిట్టర్లు వచ్చినా ఆ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు.

సీజన్ల వారీగా సిక్సర్ల రికార్డులు ఇవే

ఐపీఎల్ చరిత్రలో ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒకరు తమ పవర్‌తో బంతిని స్టేడియం దాటించారు. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 122 మీటర్ల సిక్సర్‌తో అగ్రస్థానంలో నిలవగా, 2010లో రాబిన్ ఉతప్ప 120 మీటర్ల సిక్సర్ బాదాడు. 2011లో మళ్ళీ గిల్‌క్రిస్ట్ తన ప్రతాపం చూపిస్తూ 122 మీటర్ల సిక్సర్ కొట్టాడు. 2012లో టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ 112 మీటర్ల సిక్సర్ కొట్టి ఆ సీజన్ టాపర్‌గా నిలిచాడు. ఇక 2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 119 మీటర్ల భారీ సిక్సర్‌తో రికార్డు సృష్టించాడు.

మరికొన్ని అద్భుతమైన హిట్లు

2014లో డేవిడ్ మిల్లర్ (102 మీటర్లు), 2015లో ఏబీ డివిలియర్స్ (111 మీటర్లు), 2016లో బెన్ కటింగ్ (117 మీటర్లు) అత్యంత పొడవైన సిక్సర్లు బాదిన వారిలో ఉన్నారు. 2017లో ట్రావిస్ హెడ్ 109 మీటర్ల సిక్సర్ కొట్టగా, 2018లో మళ్ళీ డివిలియర్స్ 111 మీటర్ల సిక్సర్‌తో మెరిశాడు. 2019లో ఎంఎస్ ధోనీ మరోసారి 111 మీటర్ల సిక్సర్ బాదగా, 2020లో నికోలస్ పూరన్ (106 మీటర్లు), 2021లో కీరన్ పొలార్డ్ (105 మీటర్లు) టాపర్లుగా నిలిచారు.

ఇటీవలి కాలంలో విధ్వంసం

ఐపీఎల్ 2022లో లియామ్ లివింగ్‌స్టన్ 117 మీటర్ల భారీ సిక్సర్‌తో చెలరేగిపోగా, 2023లో ఫాఫ్ డు ప్లెసిస్ 115 మీటర్ల సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక గత ఏడాది అంటే 2024లో హెన్రిక్ క్లాసెన్ 108 మీటర్ల సిక్సర్ కొట్టి ఆ సీజన్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ 2026పైనే ఉన్నాయి. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ హిట్టర్లు మళ్ళీ 125 మీటర్ల మార్కును చేరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us