Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి తీపికబురు.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్ల జారీపై అప్డేట్ వచ్చేసింది..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. టీటీడీ ప్రతీ నెలా ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జూన్ నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. జూన్ నెలకు సంబందించిన దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనం టికెట్ల జారీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏయే టికెట్లు ఏ రోజున విడుదల చేస్తామనే దానిపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది.
జూన్ కోటా విడుదల
వృద్దులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక శ్రీవారి ట్రస్టు దర్శన టికెట్లను కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక 23న ఉదయం 11 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనుండగా.. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను రిలీజ్ చేయనున్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మెత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్లను మార్చి 18న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
మార్చి 20న ఎలక్ట్రానిక్ డిప్
ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందినవారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. https://ttdevasthanams.ap.gov.in //ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్లలోకి వెళ్లి ఆన్‌లైన్‌లో టికెటలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.
