స్లీపర్ బస్సుకు క్లయిమాక్స్ ఫిక్స్..? ఇకపై పుష్పక విమానాల్లాంటి బస్సులు రోడ్లపై కనిపించవా..?
నిన్నటిదాకా పుష్పక విమానాల్లా దర్జాగా తిరిగిన స్లీపర్ బస్సులు.. రేపటిరోజున వాషౌట్ అయిపోతే..! అవును, సీటర్ బస్సులుగా షేపౌట్ చేసుకుంటునే స్లీపర్ బస్సులను తిరగనిస్తామని రూలింగ్ పాస్ కాబోతోంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ దిశగానే ఆలోచిస్తున్నాయి. మరి, భారతదేశంలో స్లీపర్ బస్సులపై సంపూర్ణ నిషేధం సాధ్యమేనా? అంటే, వైనాట్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రెండేరెండేళ్లలో మన రోడ్లపై స్లీపర్ బస్సు ఒక్కటైనా కనిపించదు.. అని పక్కా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమవుతోంది. మరి, స్లీపర్ బస్సులకు స్పీడ్ బ్రేకర్లు తప్పవా?

నిన్నటిదాకా పుష్పక విమానాల్లా దర్జాగా తిరిగిన స్లీపర్ బస్సులు.. రేపటిరోజున వాషౌట్ అయిపోతే..! అవును, సీటర్ బస్సులుగా షేపౌట్ చేసుకుంటునే స్లీపర్ బస్సులను తిరగనిస్తామని రూలింగ్ పాస్ కాబోతోంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ దిశగానే ఆలోచిస్తున్నాయి. మరి, భారతదేశంలో స్లీపర్ బస్సులపై సంపూర్ణ నిషేధం సాధ్యమేనా? అంటే, వైనాట్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రెండేరెండేళ్లలో మన రోడ్లపై స్లీపర్ బస్సు ఒక్కటైనా కనిపించదు.. అని పక్కా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమవుతోంది.
మచ్చుకైనా కనిపించని భద్రతాప్రమాణాలు, బోలెడన్ని డిజైన్ లోపాలు , బేఖాతరయ్యే నిబంధనలు.. అన్నీ కలిసి స్లీపర్ బస్సులను నిలువునా తగలెడుతున్నాయి. ప్రయాణీకుల ప్రాణాలను మంటల్లో కలిపేస్తున్నాయి. మనుషులను కళేబరాలుగా మార్చేస్తున్నాయి. కేవలం 4 నెలల గ్యాప్‌లో ఆరు యాక్సిడెంట్లు జరిగితే 145 మంది చనిపోయారంటే స్లీపర్ బస్సులు ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది.
ప్యాసింజర్ బస్సులకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయని తెలుసా..? మన దేశంలో ట్రావెల్ బస్సులు వాటిలో 50 శాతం కూడా పాటించడం లేదు. అత్యంత తక్కువ ఎత్తులో, పూర్తిగా వెనక్కు వాలే ఛాన్స్ లేక.. కనీసం ఆర్మ్ రెస్ట్ ఫెసిలిటీ కూడా లేకుండా ఏర్పాటు చేసిన బెర్తులు అసౌకర్యమే కాదు, మన ఆరోగ్యాల్ని కూడా తినేస్తున్నాయి. ఖర్మకాలి యాక్సిడెంట్ అయితే.. మిగిలేదేముంది? కాలి బూడిదవడమే..!
స్లీపర్ బస్సుల్లో ఉండే డబుల్ బెర్త్ అయితే ఇంకా అసౌకర్యం.. ఒకరికొకరు తగలకుండా పడుకోవడం అసాధ్యం. పడుకుంటామనే గాని, అక్కడ కలత నిద్రే తప్ప సౌండ్ స్లీప్ అనేది కల్లే. పైగా, మన భారతీయ రహదారులపై కుషనింగ్ చాలా తక్కువ. బంపీనెస్ లేని రోడ్లపై ప్రయాణమంటే చచ్చేంత కుదుపులు ఖాయం. స్లీపర్ బస్సు డిజైనింగ్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, బస్సు ఎత్తు. దీంతో వచ్చే గ్రావిటీ సమస్య. మలుపులు, కుదుపుల దగ్గర స్టీరింగ్ అదుపు తప్పి, ప్రమాదాలకు ఈజీగా దొరికిపోతాయి. సీటర్ బస్సులో మాగ్జిమమ్ 52 సీట్లుంటాయి. దాన్నే 48 బెర్తులతో స్లీపర్ బస్సుగా మార్చేస్తారు. అంతే బస్సు లోపల ఎంత ఇరుగ్గా ఉంటుందో దీన్ని బట్టే అర్థమవుతుంది.
ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ బ్లాకైపోకుండా ఏమేం ఏర్పాట్లున్నాయి, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా.. ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారయ్యే బెడ్డింగ్ ఉందా.. ఇవన్నీ ఆర్టీఓ తనిఖీల్లో రెగ్యులర్‌గా చెక్ చేసే పరిస్థితే లేదు. అందుకే, ఇలా నెలకోసారైనా మంటల్లో స్లీపర్ బస్ అనే బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తోంది. అన్ని వైపుల నుంచీ సిఫార్సులు వెల్లువెత్తడంతో స్లీపర్ బస్సుల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. వేలకొద్దీ ఉన్న స్లీపర్ బస్సులను ఉన్నపళంగా రద్దు చేయడం సాధ్యమేనా? అనే సందేహాలకు సమాధానం కూడా ఉంది. చిత్తశుద్ధి ఉంటే కేవలం రెండేళ్లలోనే స్లీపర్ బస్సులను నిర్మూలించవచ్చు.
కంప్లీట్ బ్యాన్ ఎలా..?
- మొదటి మూడునెలల్లో ఉత్పత్తి, దిగుమతి నిలిపి వేయడం ఫస్ట్ స్టెప్.
- తర్వాత తొమ్మిది నెలల పాటు రూట్ కెపాసిటీ ప్రకారం.. సీటర్ బస్సులతో స్లీపర్ సర్వీసులను రీప్లేస్ చెయ్యడం..
- ఏడాదిన్నర లేదా రెండేళ్లలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిలిపివేయవచ్చు.
- ఈ రెండేళ్లలో ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలి.
- హైస్పీడ్ రైళ్ల సంఖ్యను పెంచడం, చవక ప్రయాణాన్ని అలవాటు చేయడానికి ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడం.. ఇవీ ప్రత్యామ్నాయ మార్గాలు
- అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థను సరిగ్గా సమన్వయం చేసుకోవడం, తనిఖీల సంఖ్య పెంచడం, బస్సుల ఫిట్‌నెస్‌ను పెంచడం..
- పెనాల్టీల మోతాదును పది లక్షల దాకా పెంచడం.. ఈ రూల్‌బుక్‌ని పాటిస్తే స్లీపర్ బస్సులపై కంప్లీట్ బ్యాన్ సాధ్యమేగా?
మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్లీపర్ బస్సుల ప్రమాదాలపై సీరియస్‌గా రియాక్టయింది. NHRC చేసిన మొదటి సిఫార్సు కూడా ఇదే. అన్ని స్లీపర్ బస్సులను వెనక్కు పిలిపించాలని సూచించింది. స్లీపర్ బస్సులను నియంత్రించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, హైవేస్ అథారిటీకి లేఖలు కూడా రాసింది. సో, స్లీపర్ బస్సుకు క్లయిమాక్స్ మొదలైనట్టేనా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
