AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Induction Stove Ring: ఇండక్షన్‌ స్టౌపై ఈ వృత్తాకార గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

ప్రస్తుతం సర్వత్రా ఎల్‌పిజి గ్యాస్ కొరత వేదిస్తుంది. దీంతో దాదాపు అన్ని ఇళ్లల్లో ఇండక్షన్ వాడకం పెరిగింది. కానీ మీరు ఎప్పుడైనా దానిని దగ్గరగా గమనించారా? ఇండక్షన్‌పై ఒక ప్రత్యేకమైన గుండ్రని ఆకారం ఉంటుంది. అది దేనికి ఉపయోగపడుతుందో మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? మనం దాదాపు దీనిని పట్టించుకోము. ఇది కేవలం పాత్రలు స్టవ్‌పై ఉంచడానికి మాత్రమే అని అనుకుంటాం..

Srilakshmi C
|

Updated on: Apr 08, 2026 | 8:20 PM

Share
ప్రస్తుతం సర్వత్రా ఎల్‌పిజి గ్యాస్ కొరత వేదిస్తుంది. దీంతో దాదాపు అన్ని ఇళ్లల్లో ఇండక్షన్ వాడకం పెరిగింది. కానీ మీరు ఎప్పుడైనా దానిని దగ్గరగా గమనించారా? ఇండక్షన్‌పై ఒక ప్రత్యేకమైన గుండ్రని ఆకారం ఉంటుంది. అది దేనికి ఉపయోగపడుతుందో మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? మనం దాదాపు దీనిని పట్టించుకోము. ఇది కేవలం పాత్రలు స్టవ్‌పై ఉంచడానికి మాత్రమే అని అనుకుంటాం. ఈ వలయం కేవలం పాత్రల కోసం మాత్రమే కాదు, ఇది మీ ఇంటి విద్యుత్ బిల్లును కూడా నిర్ధారిస్తుంది. అంతేకాకుండా మీ ఇండక్షన్‌ ఎంతకాలం పనిచేస్తుందో కూడా ఇది నిర్ణయిస్తుంది.

1 / 5
ఇండక్షన్ గ్లాస్‌పై ఉన్న వృత్తానికి కొంచెం కింద రాగి లేదా అల్యూమినియంతో చేసిన అయస్కాంత కాయిల్ ఉంటుంది. మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఈ కాయిల్ విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు పాత్రను ఈ వృత్తం మధ్యలో ఉంచినట్లయితే, 90 శాతం శక్తి పాత్రను వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది.

2 / 5
ఒకవేళ పాత్ర వృత్తం వెలుపల ఉన్నా లేదా వృత్తం కంటే చాలా చిన్నదిగా లేదా పెద్దదిగా ఉన్నా అయస్కాంత తరంగాలు పాత్రకు సరిగ్గా చేరవు. దీనివల్ల ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం అధికమవుతుంది. మీరు గిన్నె అడుగుభాగం చుట్టుకొలతకు సరిపోని విధంగా దానిని ఉంచితే, గిన్నెను వేడి చేయడానికి ఇండక్షన్‌ రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల ఆహారం ఉడకడానికి 15 నుండి 20 నిమిషాలు ఎక్కువ సమయం పట్టవచ్చు. అంతేకాకుండా దీనివల్ల మీ విద్యుత్ బిల్లు 20 నుండి 30 శాతం వరకు పెరగవచ్చు.

3 / 5
ఈ గుండ్రని రింగ్ కింద ఉష్ణోగ్రతను నియంత్రించే సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. పాత్రాను తప్పుగా అమర్చితే, ఇండక్షన్ కాయిల్ అధికంగా వేడెక్కుతుంది. దీనివల్ల మెషీన్‌లోని మెయిన్ సర్క్యూట్ (PCB) కాలిపోయే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా మీ ఖరీదైన ఇండక్షన్‌ అకాలంగా పాడైపోవచ్చు. అందువల్ల, ఇండక్షన్ మీద వంట చేసేటప్పుడు పాత్రను ఎల్లప్పుడూ వృత్తంకి సరిగ్గా సరిపోలా చూసుకోవాలి. వీలైతే, ఇండక్షన్ వృత్తం పరిమాణంలోనే ఉండే, చదునైన అడుగుభాగం గల పాత్రలను వాడటం మంచిది. పాత్ర మరీ పెద్దదిగా గానీ, మరీ చిన్నదిగా గానీ ఉండకూడదు.

4 / 5
పాత్రను ఉంచేటప్పుడు, దాని కింద ఉన్న కాయిల్‌కు షాక్ తగలకుండా కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండక్షన్‌పై ఉండే ఆ వలయమే సురక్షితమైన, పొదుపైన వంటకు ఆధారం. దానిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.

5 / 5
Follow Us