AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danger Bird:ఒక్క తన్నుతో మనిషి ప్రాణం తీయగల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఇదే!

'పక్షులు' అనగానే మనకు గుర్తొచ్చేవి ఎగిరే పావురాలు, అందమైన నెమళ్లు లేదా పాటలు పాడే కోయిలలు. ఇవి కాకుండా కాస్త పెద్ద పక్షులు అంటే నిప్పుకోడి లేదా ఈము పక్షులను చూసుంటాం. సాధారణంగా పక్షులు మనుషులను చూసి భయపడి పారిపోతాయి తప్ప.. ఎదురు తిరిగి దాడులు చేయవు. కానీ, ఆధునిక సైన్స్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ప్రకారం.. ఈ భూమి మీద ఒక భయంకరమైన పక్షి ఉంది, దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి" గా ప్రకటించింది.

Danger Bird:ఒక్క తన్నుతో మనిషి ప్రాణం తీయగల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఇదే!
Most Dangerous Bird In The World Cassowary
Bhavani
|

Updated on: Jun 01, 2026 | 9:43 PM

Share

చూడటానికి రంగురంగుల మెడతో, తలపై ఒక పెద్ద కిరీటంతో ఎంతో అందంగా కనిపించే ఈ పక్షికి కోపం వస్తే మాత్రం.. ఎదురుగా సింహమున్నా సరే లెక్కచేయదు. తనకున్న పవర్‌ఫుల్ కాళ్లతో ఒక్క తన్ను తన్నిందంటే.. మనిషి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. మరి డైనోసార్ల కాలం నాటి పోలికలతో ఉండే ఆ భయంకరమైన పక్షి ఏంటి? దానికి అంతటి పవర్ ఎలా వచ్చింది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ ప్రసిద్ధ వన్యప్రాణి శాస్త్రవేత్తలు నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆ పక్షి పేరు ‘కాసోవరీ’. ఆస్ట్రేలియా, న్యూగినియా దట్టమైన అడవుల్లో కనిపించే ఈ పక్షికి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ నిజాలు ఇక్కడ ఉన్నాయి:

1. కత్తిలాంటి ఐదు అంగుళాల గోళ్లు కాసోవరీ పక్షికి రెక్కలు ఉన్నప్పటికీ ఇది ఎగరలేదు. కానీ దీని బలం అంతా దీని కాళ్లలోనే దాగి ఉంది. దీని కాళ్లకు ఉండే మూడు వేళ్లలో, లోపలి వైపు ఉండే వేలికి దాదాపు 5 అంగుళాల (12 సెంటీమీటర్లు) పొడవున్న పదునైన గోరు ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం ఒక కత్తిలా ఉంటుంది. ఈ పక్షి ఎగిరి తన్నినప్పుడు.. ఆ గోరు మనుషుల లేదా ఇతర జంతువుల పొట్టలోకి దిగిపోయి అంతర్గత అవయవాలను చీల్చేస్తుంది. దీనివల్ల విపరీతమైన రక్తస్రావం జరిగి ప్రాణాలు పోతాయి.

2. కంగారూలను మించిన జంపింగ్ పవర్: కాసోవరీ పక్షులు దాదాపు 5 నుండి 6 అడుగుల ఎత్తు, 60 కిలోలకు పైగా బరువు ఉంటాయి. ఇంత భారీ శరీరం ఉన్నప్పటికీ ఇవి భూమిపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అంతేకాదు, ఇవి నిలబడిన చోటు నుండి గాల్లోకి దాదాపు 7 అడుగుల ఎత్తుకు ఈజీగా జంప్ చేయగలవు. ఎదురుగా ఉన్న శత్రువు ముఖం లేదా ఛాతి భాగంపై నేరుగా కాళ్లతో దాడి చేయడానికి ఈ జంపింగ్ పవర్ వీటికి ఎంతగానో సహాయపడుతుంది.

3. తలపై ఉండే హెల్మెట్ రహస్యం ఈ పక్షుల తలపై ఒక పెద్ద కొమ్ము లాంటి నిర్మాణం ఉంటుంది, దీన్ని ‘కాస్క్’ అని పిలుస్తారు. ఇది చూడటానికి ఒక హెల్మెట్ లాగా ఉంటుంది. దట్టమైన అడవుల్లో వేగంగా పరిగెత్తేటప్పుడు చెట్ల కొమ్మలు తలకు తగలకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే వేరే జంతువులతో ఫైట్ చేసేటప్పుడు దీన్ని ఒక ఆయుధంగా కూడా వాడుతుంటాయి.

4. డైనోసార్ల వారసులు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. కాసోవరీ పక్షుల శరీర నిర్మాణం, వాటి కాళ్లు, నడిచే విధానం అచ్చం కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన ‘వెలాసిరాప్టర్’ అనే ప్రమాదకరమైన డైనోసార్ల పోలికలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని “ఆధునిక కాలపు డైనోసార్లు” అని పిలుస్తారు. వీటికి కోపం వస్తే అస్సలు తగ్గవు, ఎంతటి పెద్ద జంతువునైనా వెంటాడి మరీ వేటాడతాయి.

5. మనుషులపై దాడులు ఎందుకు చేస్తాయి?: సాధారణంగా కాసోవరీలు అడవుల్లో దొరికే పండ్లను తిని బతుకుతాయి. కానీ మనుషులు వాటి ఆవాసాలను నాశనం చేయడం లేదా వాటికి ఆహారం ఆశ చూపి వేధించడం వల్ల వీటికి కోపం వస్తుంది. తమ పిల్లలకు లేదా తమ సరిహద్దులకు ముప్పు పొంచి ఉందని భావిస్తే ఇవి క్షణాల్లో రౌద్రరూపం దాల్చుతాయి. ఆస్ట్రేలియాలో వీటి దాడుల కారణంగా ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు.

అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూ పార్కులలో కూడా ఈ కాసోవరీ పక్షుల బోనులను క్లీన్ చేయడానికి కీపర్లు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సృష్టించిన జీవుల్లో అత్యంత భయంకరమైన ‘వన్ షాట్ కిల్లర్’ ఈ కాసోవరీ పక్షి!

Follow Us