AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బిడ్డలు అద్భుతమైన నటులు.. అతనితో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే: మోహన్ బాబు

సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ స్టార్ హీరోతో తన అనుబంధం, రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఎదురైన సవాళ్లు, తన కుటుంబ సభ్యుల సినీ ప్రస్థానం గురించి వివరంగా మాట్లాడారు. అలాగే తన బిడ్డలు అద్భుతమైన నటులని వారికి మంచి సినిమాలు రావాలని కోరుకున్నారు.

నా బిడ్డలు అద్భుతమైన నటులు.. అతనితో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే: మోహన్ బాబు
Mohanbabu
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 1:14 PM

Share

సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తన సహకారాల గురించి ప్రస్తావిస్తూ, గతంలో విలన్‌గా, సహనటుడిగా తామిద్దరం అనేక విజయవంతమైన చిత్రాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కొదమసింహంతో పాటు పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్ల రంగ, చక్రవర్తి వంటి సినిమాలను ప్రస్తావించారు. ఆ తర్వాత తామిద్దరం కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణాలు లేవని, చిరంజీవి అడిగితే అయన సినిమాలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్

1995లో తొలిసారిగా ఎన్. టి. రామారావు, చంద్రబాబు నాయుడు తనను పార్లమెంటుకు పంపారని తెలిపారు. ఆ సమయంలో తన ఇంగ్లీష్, హిందీ భాషా పరిజ్ఞానం తక్కువగా ఉండేదని, ప్రస్తుతం అది మెరుగుపడిందని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల సినీ ప్రస్థానంపై మాట్లాడిన మోహన్ బాబు, తన తండ్రి ఉపాధ్యాయుడని, తాత సాధారణ వ్యక్తి అని, తాము రాజులం కాదని, కష్టపడి పైకి వచ్చిన మధ్య తరగతి కుటుంబం వారమని స్పష్టం చేశారు. తన ముగ్గురు పిల్లలు విష్ణు, మంచు లక్ష్మి, మనోజ్ అద్భుతమైన నటులని ప్రశంసించారు. వారికి మంచి కథలు ఎంచుకునే అవకాశం రావాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఓ మై గాడ్..! అన్నా.. ఇది నువ్వేనా..!! పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్

సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ, అమీర్ ఖాన్ నటించిన “దంగల్” వంటి కమర్షియల్ హంగులు లేని, బలమైన కథా చిత్రాలు చేయాలనే కోరిక తనకు ఉందని తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో ఎదురైన కొన్ని వైఫల్యాల వల్ల ఆర్థికంగా నష్టపోయానని, తన  సినిమాలు విజయం సాధిస్తే, అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి తాను వెనుకాడనని అన్నారు. “ధైర్యే సాహసే లక్ష్మి” అని చెప్పినప్పటికీ, పరిశ్రమలో ధైర్యం చేయడానికి లక్ష్మి (డబ్బు) కూడా అవసరమని పేర్కొన్నారు. రీమేక్‌ల ఎంపికపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తాము రీమేక్‌ల కోసం వెతకమని, మంచి కథ దొరికితేనే చేస్తామని తెలిపారు. కొన్ని రీమేక్‌లు తనకు విజయాన్ని అందించాయని, కొన్ని మలయాళ చిత్రాలు రీమేక్ చేసినప్పటికీ అవి ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. స్ట్రెయిట్ చిత్రాల కంటే రీమేక్‌లు ఆర్థికంగా కొంత సౌకర్యవంతంగా ఉంటాయని, వాటిలోని లోపాలను సరిదిద్ది స్థానికతకు తగ్గట్టు మార్పులు చేసుకోవచ్చని అన్నారు మోహన్ బాబు.

ఇది కూడా చదవండి : సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us