AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో పెట్టుకునే కూరగాయ విత్తనాలు ఇవే.. ఈ చిన్న జూన్ లాజిక్‌తో బుట్టలు బుట్టలు కాస్తాయ్..

జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి, టెర్రస్ గార్డెన్, అలాగే.. పెరట్లో పెంపకానికి ఇది సరైన సమయం. ఈ నెలలో పెంచదగిన కూరగాయ విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు. నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. విత్తన ప్యాకెట్లపై గడువు తేదీని తనిఖీ చేయాలి.

వర్షాకాలంలో పెట్టుకునే కూరగాయ విత్తనాలు ఇవే.. ఈ చిన్న జూన్ లాజిక్‌తో బుట్టలు బుట్టలు కాస్తాయ్..
June Planting Seeds
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2026 | 12:55 PM

Share

జూన్ నెల వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇప్పటికే.. రుతుపవనాలు ఇది పెరట్లో అలాగే.. టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికులకు కొత్త పంటలను నాటడానికి అనుకూలమైన సమయం.. మంచి దిగుబడి సాధించాలంటే సరైన రకం కూరగాయ విత్తనాలను ఎంపిక చేసుకోవడం.. వాటి నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం.. నిపుణుల సూచనల ప్రకారం, చిన్నపాటి కంటైనర్‌లలో కూడా ఉత్తమ ఫలితాలను పొందేలా విత్తనాలను ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ముందుగా.. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ప్యాకెట్‌పై ఉన్న గడువు తేదీని పరిశీలించాలి.. తక్కువ నాణ్యత గల విత్తనాలను నాటడం వల్ల శ్రమ, సమయం వృథా అవుతాయి. మొదటిసారి హైబ్రిడ్ విత్తనాలతో పెంచిన పంటల నుండి సేకరించిన విత్తనాలు తదుపరి సీజన్‌లలో ఆశించిన దిగుబడిని ఇవ్వకపోవచ్చు. కాబట్టి, ప్రతిసారీ తాజా, నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేయడం మంచిది. నమ్మకమైన విక్రేతలను ఎంచుకోవడం వల్ల నాణ్యమైన విత్తనాలను పొందవచ్చు.. అలాగే.. మొక్కలు మంచిగా ఎదిగి.. ఆశించిన దిగుబడిని కూడా ఇస్తాయి.

జూన్ నెలలో నాటదగిన ప్రధాన కూరగాయ విత్తనాలు:

బెండకాయలు: అన్ని సీజన్లలోనూ బెండకాయలు బాగా పండుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మంచి దిగుబడి వస్తుంది. ఎర్ర బెండ (రెడ్ వాక్రా) కూడా పెంచవచ్చు. హైబ్రిడ్ విత్తనాలను ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.

బీరకాయలు: బీర కూడా అన్ని కాలాలలోనూ మంచిగా వస్తుంది. ఇందులో నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు, పొడుగు, పొట్టి, లావు రకాలు, గుత్తి బీర వంటి వివిధ వెరైటీలు ఉన్నాయి. మీకు నచ్చిన వెరైటీని ఎంపిక చేసుకోవచ్చు.

పొట్లకాయలు: పొట్లకాయలలో పొడుగు రకాలు, పిచ్చుక పొట్లకాయలు (పొట్టి వెరైటీ) ఉన్నాయి. మీ తోటలోని ప్రదేశాన్ని బట్టి సరైన రకాన్ని ఎంచుకోవచ్చు.

కాకరకాయలు: కాకరకాయలలో ముదురు రంగు రకాలు, తెల్ల కాకరకాయలు ఉన్నాయి. ఈ రకాలు వర్షాకాలంలో బాగా పండుతాయి.

చిక్కుడు కాయలు: చెట్టు చిక్కుడు కాయలు వర్షాకాలం, శీతాకాలంలో అధిక దిగుబడిని ఇస్తాయి. వేసవిలో కొద్దిగా తక్కువ కాపు ఉన్నప్పటికీ, వర్షాకాలంలో తప్పకుండా పెంచవచ్చు.

బీన్స్ రకాలు:

  • అలసందలు: జూన్ నెలలో నాటడానికి అనువైనవి.
  • ఫ్రెంచ్ బీన్స్: ఈ సీజన్‌లో పెంచవచ్చు.
  • లవంగం బీన్స్ (క్లౌ బీన్స్): ఇవి ఆరోగ్యానికి మంచివి. శీతాకాలంలో చాలా బాగా కాస్తాయి, వర్షాకాలంలో నాటితే శీతాకాలం వరకు కాపు వస్తూనే ఉంటుంది.
  • పర్పుల్ బీన్స్: గత సీజన్‌లో పెంచినట్లుగా, ఈసారి కూడా ప్రయత్నించవచ్చు.
  • గోరు చిక్కుడు కాయలు: వేసవిలో బాగా కాసినప్పటికీ, వర్షాకాలంలో కూడా పెంచవచ్చు, కాపు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.
  • ఆనపకాయలు: నల్ల ఆనపకాయ, హైబ్రిడ్ గుండ్రటి ఆనపకాయ వంటి రకాలు జూన్ నెలలో పెంచవచ్చు.

వంకాయలు: ఆకుపచ్చని రంగు వంకాయలు (చారలతో), పొడవు వంకాయలు (రెండు అడుగుల వరకు), ముచ్చుక వంకాయలు (గుండ్రంగా, టొమాటో ఆకారంలో, తెలుపు రంగులో ఉంటాయి) వంటి విత్తనాలను నాటవచ్చు. పచ్చిమిర్చి, వంగ నారు పోయడంపై ప్రత్యేక వీడియోలు కూడా రానున్నాయి.

దోస: వర్షాకాలంలో దోసకాయలను కూడా పెంచవచ్చు.

ఆరకాకర: ఇవి బొప్పాయి గింజల వలె కనిపిస్తాయి. మంచి దిగుబడి కోసం మగ, ఆడ పాదులు రెండూ ఉండేలా చూసుకోవాలి. గతంలో కేవలం మగ పాదులు మాత్రమే వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి.

చిన్న కంటైనర్‌లలో కూడా విజయవంతంగా తోటపని చేయాలంటే సరైన విత్తన ఎంపిక, నాణ్యమైన విత్తనాల కొనుగోలు అత్యంత ప్రాథమిక అంశాలు., దీంతోపాటు.. కంపోస్ట్ ఎరువు కూడా వేసుకోవాలి.. మంచిగా వాటికి నీరు పోస్తూ.. సంరక్షణ చర్యలు తీసుకోవాలి.. అలాగే.. తెగుళ్లు వ్యాపించకుండా చిన్న పాటి చర్యలు తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీ జూన్ నెల టెర్రస్ గార్డెన్ పెంపకం విజయవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us