కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!
గొల్లపూడి మారుతీరావు తన సినీ కెరీర్‌లో ఒకే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేమ పుస్తకం చిత్రంతో ఆయన చిన్న కొడుకు శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉండగా, చిత్రీకరణ సమయంలో విషాదకరంగా మరణించారు. తన కొడుకు కలను నెరవేర్చడానికి, అసంపూర్తిగా మిగిలిన ఆ సినిమాను మారుతీరావు గారే పూర్తి చేశారు,

గొల్లపూడి మారుతీరావు.. తెలుగు సినీ పరిశ్రమకు రచయితగా, నటుడిగా చిరపరిచితులు. అయితే, ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం, దీని వెనుక ఒక విషాద గాథ, ఒక తండ్రి కొడుకు పట్ల చూపిన అపారమైన ప్రేమ దాగి ఉంది. మారుతీరావు మొదట్లో జర్నలిస్టుగా, ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. 1965 నుంచే సినిమాలకు కథలు రాయడం మొదలుపెట్టి, 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా మారారు. అప్పటికే ఆయనకు ముగ్గురు కొడుకులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. మొదటి ఇద్దరు కొడుకులు ట్రావెల్స్ వ్యాపారంలో స్థిరపడగా, చిన్న కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ మాత్రం సినీ రంగంపై మక్కువ పెంచుకున్నారు. దర్శకుడిగా మారాలని కలలు కన్న శ్రీనివాస్, కోడి రామకృష్ణ, రాఘవేంద్ర రావు వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం సంపాదించారు.
ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్
1992లో శ్రీనివాస్ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవాలని భావించారు. ఈ సమయంలోనే అజిత్ సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు చరణ్ ద్వారా అజిత్ పరిచయం ఏర్పడింది. నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు ఒక బెంగాలీ చిత్రం అమర్ తుమీ స్ఫూర్తితో ఒక కథను తెలుగులోకి తీసుకురావాలనుకున్నారు. ఈ కథకు మెరుగులు దిద్ది, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చింది గొల్లపూడి మారుతీరావు గారే. శ్రీనివాస్ దర్శకత్వంలో, అజిత్‌ను హీరోగా ఎంపిక చేసి, ప్రేమ పుస్తకం సినిమాకు శ్రీకారం చుట్టారు. 1992 ఆగస్టు 3న ఈ సినిమా వైజాగ్ బీచ్‌లో షూటింగ్ ప్రారంభించుకుంది ఈ సినిమా. గొల్లపూడి మారుతీరావు గారు విశాఖపట్నంలోనే స్థిరపడటం వల్ల, కొడుకు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో తరచుగా షూటింగ్‌లో పర్యవేక్షణ చేసేవారు. అయితే, ఆగస్టు 12న, షూటింగ్ ప్రారంభమైన కేవలం తొమ్మిది రోజుల తర్వాత ఘోరం జరిగింది. విశాఖపట్నం బీచ్‌లో ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా, శ్రీనివాస్ ఒక బండరాయిపై నిలబడి నటీనటులకు పోజులు చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఓ మై గాడ్..! అన్నా.. ఇది నువ్వేనా..!! పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్
అప్పుడు పున్నమి వెన్నెల కావడంతో అలల తాకిడి ఎక్కువగా ఉంది. అకస్మాత్తుగా వచ్చిన బలమైన అలల ధాటికి శ్రీనివాస్ జారిపడిపోయారు. కింద పడే క్రమంలో తలకు బండరాయి తగలడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే పెద్ద అల వచ్చి ఆయను లాక్కెళ్లింది. దాంతో ఆయన కోసం చాలా సేపు సముద్రంలో గాలించారు. చివరకు ఒక గంట తర్వాత శవం పైకి తేలింది. ఈ విషాద ఘటన హీరో అజిత్‌తో సహా చిత్రబృందం కళ్లముందే జరిగింది. మరణించిన తొమ్మిది నెలల క్రితమే పెళ్లయిన శ్రీనివాస్ భార్య జయంతి కూడా అక్కడే ఉన్నారు. కొడుకు దర్శకుడిగా తన కలలను సాకారం చేసుకుంటాడని ఆశించిన మారుతీరావు గారు, శ్రీనివాస్ మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శ్రీనివాస్ అంత్యక్రియలు ఆగస్టు 13న విశాఖపట్నంలో జరిగాయి, అజిత్, కంచన్ , ఇతర చిత్రబృందం కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల తర్వాత నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు, గొల్లపూడి మారుతీరావుని కలిసి, అసంపూర్తిగా మిగిలిన సినిమాను పూర్తి చేయమని కోరారు. “నా కొడుకు కల ఎలాగో నెరవేరలేదు, కానీ నా కొడుకు మధ్యలోనే వదిలేసిన ఈ సినిమాను నేను వదిలివేయలేను. వాడి కలను నేను నెరవేరుస్తాను” అంటూ మారుతీరావు గారు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వచ్చారు. శ్రీనివాస్ ఎక్కడైతే కన్నుమూశారో, సరిగ్గా అదే లొకేషన్‌లో తండ్రి మారుతీరావు గారు స్టార్ట్ కెమెరా అని చెప్పి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత, “ఇక మీదట నేను ఏ సినిమాకు దర్శకత్వం వహించను” అని ప్రకటించారు.
ఇది కూడా చదవండి : సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




