AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే

లాంగ్ గ్యాప్ తరువాత సమంత లీడ్ రోల్‌లో నటించిన సినిమా మా ఇంటి బంగారం. సామ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 11:05 AM

Share

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పవర్‌ఫుల్ రోల్‌లో నటించి స్వయంగా నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మా ఇంటి బంగారం సినిమాకు థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు సమంత ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అవ్వడం పైగా సమంత యాక్టింగ్ తో ఇరగదీయడంతో ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సమంతను ఆమె భర్తను, దర్శకురాలు నందిని రెడ్డిని అభినందించారు. సమంత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో చిరంజీవి సమంత మా ఇంటి బంగారం సినిమాను ప్రశంసిస్తూ.. ఇలా రాసుకొచ్చారు. “మా ఇంటి బంగారం” చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. అలాగే సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ అలాగే మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి : ఓ మై గాడ్..! అన్నా.. ఇది నువ్వేనా..!! పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్

అయితే గతకొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమా సమయంలో సమంత బేబీ బంప్ తో కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా మెగాస్టార్ ను సమంత కలిసినప్పుడు ఆమెను సత్కరిస్తూ.. ఆ దంపతులకు చీర, సారె పెట్టారు చిరంజీవి. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ చేయడంతో సమంత త్వరలోనే తల్లికాబోతుందని చిరంజీవి లీక్ చేశారని సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us