AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పట్టేశావ్‌రా బుల్లోడా.. ఆ ఇద్దరి తోపుల నంబర్లతో వైభవ్ జెర్సీ.. ఎంతో తెలుసా?

భారత క్రికెట్ రంగానికి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయస్సులోనే టీమిండియాకు ఎంపికపై సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో తన అసాధారణను చూసిన BCCI ఈ వండర్‌ కిడ్‌కు జాతీయ టీ20 జట్టులో చోటు కల్పించింది. ఈ సందర్భంగా ఇటీవల బీసీసీఐ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో చూద్దాం పదండి.

Video: పట్టేశావ్‌రా బుల్లోడా.. ఆ ఇద్దరి తోపుల నంబర్లతో వైభవ్ జెర్సీ.. ఎంతో తెలుసా?
Vaibhav Sooryavanshi Jersey Number
Anand T
|

Updated on: Jun 23, 2026 | 4:04 PM

Share

టీమిండియాకు ఆడడం అనేది ప్రతి క్రికెటర్ డ్రీమ్.. దీన్ని అచీవ్ చేయడానికి చాలా మందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం 15 ఏళ్లకే తన కలని నిజం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అందరిని ఆకర్షించిన వైభవ్..బీసీసీఐ సెలెక్టర్ మనసు గెలిచి 15 ఏళ్లకే ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయి అతి చిన్న వయస్సులోనే భారత జట్టుకు సెలెక్ట్ అయిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని ప్రతిబింబిస్తూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో, టీమ్ ఇండియా ప్రముఖ త్రోడౌన్ స్పెషలిస్ట్ ‘రఘు’ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ జెర్సీని అందుకున్నాడు. జెర్సీని అందుకున్న సూర్యవంశీ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

కల నిజమైన వేళ.. బీసీసీఐ ప్రత్యేక వీడియో!

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. జెర్సీ అందుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు..నేను మొదటిసారి చేతిలోకి బ్యాట్ పట్టుకుని, ప్రాక్టీస్ కోసం క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన రోజు నుండి ఈ క్షణం కోసమే కలలు కన్నానని. ఈ రోజు నా కల నెరవేరిందని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇది నా ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగని చెప్పుకొచ్చాడు. ఈ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. ఇది ఒక అద్భుతమైన కలలా ఉంది, ఆ జెర్సీని చూడగానే నా ముఖంలో నవ్వు ఆపుకోలేకపోయాను అని వైభవ్ తన సంతోష్యాన్ని వ్యక్తి చేశాడు.

హోటల్ రూమ్‌లోకి జెర్సీ వచ్చినప్పుడు ఇదంతా నాకు ఓ కలలా అనిపించిది.. దీనికి ఎలా రికాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదని వైభవ్ అన్నాడు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని విషయాలు మన జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మనకు తెలియదు. జెర్సీ అందుకున్నప్పుడూ నా పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది అని వైభవ్ చెప్పుకొచ్చాడు.

రైనా, హర్భజన్ జెర్సీ నంబర్‌తో వైభవ్

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో ‘నంబర్ 3’ జెర్సీని కేటాయించారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక నంబర్ జెర్సీని భారత దిగ్గజాలు అయిన హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి ప్లేయర్లు ధరించడం విశేషం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా