Viral Video: పొలంలో పనిచేస్తుండగా గడ్డి మెదల కింద అలజడి.. ఏంటని తీసి చూడగా..
పొలంలో పనులు చేస్తున్న ఓ రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. పొలంలో ఉన్న మొదలను తీస్తుండగా అతని ఓ మెద కింద ఏకంగా నాలుగు నాగు పాములు కనిపించాయి. అలాగే దాదాపు 20 నుంచి 30 వరకు పాము గుడ్లు కూడా అక్కడ ఉన్నాయి. వాటిని చూసిన రైతు భయంతో పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా పాములు జనావాసాల్లో కాకుండా అటవీ ప్రాంతంలో, పొలాల గట్లకు ఉన్న రంద్రాల్లో ఎక్కవగా నివసిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వాటి రంద్రాల్లోకి నీళ్లు చేరి పాములు సేఫ్‌గా ఉండే స్థావరాల కోసం అన్వేషిస్తాయి. తాజాగా ఇలానే కొన్ని పాములు రైతు పొలంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని దాని కిందే గుడ్లను పెట్టాయి. అయితే ఇటీవల రైతు పొలంలో ఉన్న మెదలను తొలగించేందుకు రాగా అతనికి ఊహించని సీన్ కనిపించింది.
అతను మెదను తీయగానే దాని కింద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాములు దర్శనమిచ్చాయి. అలాగే అక్కడ కొన్ని గుడ్లు కూడా కనిపించాయి. ఆ పాములను చూసి రైతు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. అయితే ఆ రైతు దూరంగా వెల్లిపోగానే ఆ పాములు మళ్లీ ఆ మొద వద్దకు చేరుకున్నాయి. అవి పెట్టిన గుడ్లను రక్షించుకునేందుకు అక్కడే తిష్టవేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇది ఒక ఏఐ వీడియో అని కొందరు కామెంట్స్ చేయగా.. మరి కొందరు నిజమేనని నమ్ముతున్నారు. మరికొందరు ఒకే దగ్గర అన్ని పాములు అస్సలూ ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోకు దాదాపు 30వేలకు పైగా లైక్స్ వందల్లో కామెంట్స్ వచ్చాయి.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
