AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: జూన్ 30 తర్వాత వీరికి గ్యాస్ కనెక్షన్ రద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు.. మీరూ ఉన్నారా..?

మీ ప్రాంతంలో సీఎన్‌జీ పైప్‌లైన్ ఫెసిలిటీ ఉందా.. అయినా మీరు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారా.. అయితే జూన్ 30 వరకు మాత్రమే టైమ్ ఉంది. ఆలోపు మీరు సీఎన్‌జీలోకి మారకపోతే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ రద్దయ్యే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ జూన్ 30తో ముగుస్తుంది.

Gas Cylinder: జూన్ 30 తర్వాత వీరికి గ్యాస్ కనెక్షన్ రద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు.. మీరూ ఉన్నారా..?
Gas
Venkatrao Lella
| Edited By: |

Updated on: Jun 26, 2026 | 3:44 PM

Share

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ నుండి పీఎన్‌జీ కనెక్షన్‌లకు మారేందుకు వినియోగదారులకు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది. మార్చిలో ఇరాన్-అమెరియా యుద్దం వల్ల పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాల జారీ జారీ చేసింది. అదేంటంటే.. ఒక కుటుంబం ఎల్పీజీ, PNG కనెక్షన్ రెండింటినీ కలిగి ఉండకూడదు. పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పీఎన్‌జీలోకి మారాలి. తమకు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లను సరెండ్ చేయాలి. ఇందుకు 90 రోజుల గడువు ఇవ్వగా.. జూన్ 30తో ముగుస్తుంది. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పీఎన్‌జీలోకి మారని వినియోగదారుల ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్యాస్ కనెక్షన్లు కట్..!

ఒక ప్రాంతంలో PNG మౌలిక సదుపాయాలు ఉండి,గడువు గురించి ఒక కుటుంబానికి తెలియజేసినప్పటికీ వారు మారకపోతే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను నిలిపివేసే అవకాశముంది. ఇప్పటికే PNG కనెక్షన్ కలిగి ఉండి ఇంకా LPG సిలిండర్లను ఉపయోగిస్తున్న వారు వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం రెండు కనెక్షన్లను ఉపయోగించకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ PNG ఇంకా ఒక ప్రాంతానికి చేరుకోకపోతే అక్కడ పైపుల ద్వారా గ్యాస్ అందుబాటులోకి వచ్చే వరకు LPG కనెక్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.దేశవ్యాప్తంగా సుమారు లక్ష కుటుంబాలు ఇప్పటికే పీఎన్‌జీకి మారాయి. మార్చి 2026 నుండి 10.02 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ చేయబడింది. మరో 3.22 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పీఎన్జీ కనెక్షన్ల మొత్తం 13.24 లక్షలకు చేరుకుంది. దాదాపు 9.94 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.

డెడ్ లైన్ కొద్ది రోజులే..

గడువు తేదీకి కేవలం కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రజలు చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. ముందుగానే జాగ్రత్తల తీసుకుని ప్రభుత్వ ఆదేశాలు పాటించడం వల్ల వంటగ్యాస్ సరఫరాలో చివరి నిమిషంలో కలిగే అంతరాయాలను నివారించవచ్చు. ఇక పైపుల ద్వారా వచ్చే గ్యాస్‌కు మారే ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు. తమ ప్రాంతంలో పైపుల ద్వారా గ్యాస్ సేవ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంకా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తుంటే జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ కనెక్షన్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికైనా వినియోగదారులు అలర్ట్ అయితే మంచిదని చమురు కంపెనీలు సూచిస్తున్నాయి.

Follow Us