AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది: నందిని రెడ్డి

దర్శకురాలు నందిని రెడ్డి తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, ఒక సినిమా పరాజయం గురించి ఆశాల్తీకార విషయాలు పంచుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అయినప్పుడు ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు, బండబూతులు ఎదుర్కొన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను కొన్ని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది: నందిని రెడ్డి
Nandini Reddy
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 12:48 PM

Share

టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి హిట్స్ తో దూసుకుపోతున్నారు. తాజాగా సమంత హీరోయిన్ గా మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు నందిని రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలను క్రియేట్ చేయడం, నటీనటుల స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా, ఆమె తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. ఒక కథానాయికకు పాత్రను తిరస్కరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, దానికి ఒక మూల్యం ఉంటుందని నందిని రెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్ద దర్శకుడి సినిమాను వదులుకుంటే మరో అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుందని, అలాంటి ధైర్యం చేసేవారు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్నారని ఆమె అన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక పాత్రపై విమర్శలు వచ్చినప్పుడు, ఆ పాత్ర చేసిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైనది కాదని, ఒక సినిమా ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్

అలాగే నందిని రెడ్డి తన దర్శకత్వంలో వచ్చిన జబర్దస్త్ సినిమా ప్లాప్ అయినప్పుడు తాను ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలను, బండబూతులను గుర్తు చేసుకున్నారు. “జబర్దస్త్ చేసినప్పుడు బండబూతులు తిట్టారు. నేను అవునండి, తప్పు నాదే. నేను ఓ చెత్త సినిమా చేశా.. మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను” అని ఆ విమర్శలను స్వీకరించినట్లు చెప్పారు. ప్రజల నుంచి  ప్రశంసలు అందుకున్నప్పుడు ఎంత సంతోషిస్తామో, విమర్శలు వచ్చినప్పుడు కూడా అంతే సహనంతో స్వీకరించాలని ఆమె అన్నారు. తాను అలా మొదలైంది వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసినా, జబర్దస్త్ పరాజయం తనను పూర్తిగా కిందకు పడేసిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఓ మై గాడ్..! అన్నా.. ఇది నువ్వేనా..!! పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్

అంత పెద్ద విజయం తర్వాత జబర్దస్త్ సినిమాను భయంతో, అప్పటికే ఉన్న కాంట్రాక్టుల ఒత్తిడితో చేయాల్సి వచ్చిందని నందిని రెడ్డి వెల్లడించారు. “భయంతో మీరు ఏది చేసినా బోల్తా పడతారు” అని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో తనకి సరైన పరిణితి లేదని, ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలియలేదని అన్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ఆ చేదు అనుభవం తనకు ఎంతో గుణపాఠం నేర్పిందని, అప్పటి నుండి తనలో భయం పూర్తిగా పోయిందని నందిని రెడ్డి తెలిపారు. ఒక సూపర్ హిట్, ఒక అట్టర్ ఫ్లాప్ రెండింటినీ చూసిన తర్వాత జీవితంలో భయపడాల్సిన అవసరం లేదని, సున్నా నుంచి వందకు, వంద నుంచి సున్నాకు ప్రయాణించడం ద్వారా జీవిత పాఠాలను నేర్చుకున్నానని ఆమె అన్నారు. అన్ని మంచి శకునములే సినిమాకు కూడా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, జబర్దస్త్ స్థాయిలో తీవ్ర విమర్శలు రాలేదని నందిని రెడ్డి  తెలిపారు. ఈ అనుభవాలు తనను వ్యక్తిగా, దర్శకురాలిగా మరింత బలంగా మార్చాయని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us