AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ యాక్‌.. అనకండి.. ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ఏనుగు విసర్జన నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారయ్యే బ్లాక్ ఐవరీ కాఫీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన కాఫీలలో ఒకటి. దీని తయారీ విధానం ఎంత విచిత్రంగా ఉంటుందో, రుచి అంత ప్రత్యేకంగా ఉంటుంది. ఒక కప్పు ధర లక్షల రూపాయలు! థాయ్‌లాండ్‌లో తయారయ్యే బ్లాక్ ఐవరీ కాఫీ తన అరుదైన ఉత్పత్తి విధానం, ప్రత్యేక రుచి కారణంగా ఈ కాఫీ తెగ పాపులర్ అవుతుంది..

ఛీ యాక్‌.. అనకండి.. ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..
Black Ivory Coffee
Srilakshmi C
|

Updated on: Jun 23, 2026 | 11:46 AM

Share

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? కాఫీ ప్రేమికులకు ఇది ఒక విలాసవంతమైన అనుభవంగా భావిస్తారు. అయితే దీనిని తయారు చేసే విధానం గురించి తెలుసుకుంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ కాఫీ ఏనుగు విసర్జన (పేడ) నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారవుతుంది! అలాగే ఒక్క కప్పు కాఫీ కోసం 50 డాలర్లు (సుమారు రూ.4,700) ఖర్చు చేయగలరా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఆ కాఫీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి. ప్రపంచంలో అత్యంత అరుదైన, ఖరీదైన కాఫీ రకాలలో ఒకటైన బ్లాక్ ఐవరీ కాఫీ (Black Ivory Coffee) ధర కిలోకు దాదాపు 2,000 డాలర్ల (అంటే మన కరెన్సీలో Rs.1,89,267) వరకు ఉంటుంది. ఈ కాఫీని ఏనుగు విసర్జన నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు.

ఈ కాఫీ ఎలా తయారవుతుంది?

ఈ ప్రత్యేక కాఫీ తయారీ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామస్తులు ముందుగా నాణ్యమైన కాఫీ గింజలను సేకరిస్తారు. అనంతరం వాటిని బియ్యం, అరటిపండ్లు, ఇతర పండ్లు, పండ్ల రసాలతో కలిపి ఏనుగులకు ఆహారంగా ఇస్తారు. ఏనుగులు ఈ ఆహారాన్ని తిన్న తర్వాత, సుమారు 15 నుంచి 17 గంటల వ్యవధిలో జీర్ణక్రియ పూర్తవుతుంది. అనంతరం విసర్జనలో బయటకు వచ్చే కాఫీ గింజలను సేకరించి, శుభ్రపరిచి, ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల కాఫీ గింజలకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఏర్పడుతుంది.

ఏనుగు పేడ కాఫీ ప్రత్యేకత ఏమిటి?

ఈ కాఫీని ఖరీదైనదిగా మార్చేది దాని తయారీ విధానమే. ఏనుగుల జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా జరిగే ఫెర్మెంటేషన్ కారణంగా కాఫీ గింజలలోని చేదు రుచి తగ్గిపోతుంది. ఫలితంగా ఈ కాఫీకి భూమి వాసనను తలపించే ప్రత్యేకమైన రుచి, స్వల్ప తీపి, నట్టి (Nutty) ఫ్లేవర్ లభిస్తాయి. ఈ కాఫీని థాయ్‌లాండ్‌లోని సురిన్ ప్రావిన్స్ ప్రాంతంలో తయారు చేస్తారు. అక్కడి గోల్డెన్ ట్రయాంగిల్ ఏషియన్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ప్రకారం, రక్షిత ఏనుగులే ఈ కాఫీ ఉత్పత్తిలో భాగమవుతాయి. కాఫీ గింజలతో పాటు పోషకాలు అధికంగా ఉండే బియ్యం, పండ్లు కూడా ఆహారంగా ఇవ్వడం వల్ల ఏనుగుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని సంస్థ చెబుతోంది. ఏనుగు విసర్జన నుంచి సేకరించిన కాఫీని తాగడం కొందరికి అసహ్యంగా అనిపించవచ్చు. అయితే కాఫీ ప్రియుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ప్రత్యేకమైన చాక్లెట్ నోట్స్, నట్టి ఫ్లేవర్, మట్టి వాసనను తలపించే రుచి, తక్కువ చేదు కారణంగా ఈ కాఫీని ఒక అరుదైన విలాస పానియంగా ధనవంతులు భావిస్తారట..!

Follow Us