AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే పట్టాల పక్కన ఈ చిన్న బాక్సులు ఎందుకుంటాయి..? వీటి ఉపయోగం ఏంటో తెలుసా..?

రైలు ప్రయాణం ప్రతీఒక్కరూ చేసి ఉంటారు. అయితే రైళ్లలో వెళ్లేటప్పుడు ట్రాక్ పక్కన సిల్వర్ బాక్సులను మీరు చూసి ఉంటారు. వీటి గురించి చాలామందికి తెలియదు. ఇవి అసలు పట్టాల పక్కన ఉంటాయి.. వీటి వల్ల లాభాలేంటి అనేది తెలియక తికమకపడుతుంటారు.

Indian Railways: రైల్వే పట్టాల పక్కన ఈ చిన్న బాక్సులు ఎందుకుంటాయి..? వీటి ఉపయోగం ఏంటో తెలుసా..?
Indian Railway
Venkatrao Lella
|

Updated on: Jun 01, 2026 | 9:37 PM

Share

భారతదేశం అతి పెద్ద రైల్వే నెట్ వర్క్‌ను కలిగి ఉంది. దేశంలోని ప్రతి ప్రాంతానికి కనెక్టివిటీ కలిగి ఉంది. దేశ నలుమూలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు. అయితే రైళ్లల్లో వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు మనకు ఆసక్తి కలిగిస్తాయి. రైళ్లపై ఉండే గుర్తులు, పట్టాలపై ఇండే సైన్ బోర్డులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ గుర్తులకు అర్థం ఏంటనేది తెలియక చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు రైళ్లల్లో వెళ్లేటప్పుడు పట్టాల పక్కన కొంత దూరంలో సిల్వర్ బాక్సులు చూసి ఉంటారు. వీటికి తాళం వేసి ఉంటుంది. అసలు వీటిల్లో ఏముంటుంది? అనేది మీకు తెలుసా.. ఇప్పుడు అసలు విషయాలు చూద్దాం.

సిల్వర్ బాక్సులు ఎందుకు..?

రైలు పట్టాల పక్కనే కొంత దూరంలో చిన్న సిల్వర్ బాక్సులు ఉంటాయి. వీటిని యాక్సిల్ కౌంటర్ బాక్సులుగా పిలుస్తారు. వీటిల్లో ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు సెన్సార్లు, డేటా ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. ట్రైన్ ఒక నిర్థిష్ట ప్రాంతంలో ట్రాక్‌పైకి వచ్చినప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు సెన్సార్లు దాని చక్రాల సంఖ్యను నమోదు చేస్తుంది. ఈ సమాచారంగా ఆధారంగానే ట్రాక్ ఖాళీగా ఉందా..? లేదా? అనేది రైల్వే వ్యవస్థ గుర్తిస్తుందట. ట్రైన్ ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు దాని చక్రాల సంఖ్యను లెక్కిస్తుంది. అలాగే వెళ్లేటప్పుడు మళ్లీ సంఖ్యను లెక్కిస్తుంది. రెండూ సంఖ్యలు ఒకేలా ఉంటే ట్రైన్ ట్రాక్ దాటిందని నిర్ధారిస్తుంది. ఆ ట్రాక్‌ తర్వాత వచ్చే రైలుకు సిద్దంగా ఉందని వ్యవస్థ గుర్తిస్తుంది.

రైల్వే భద్రతలో కీలక పాత్ర

ఒకవేళ చక్రాల లెక్కల్లో తేడా వస్తే వెంటనే వార్నింగ్ పంపిస్తుంది. దీని వల్ల సిగ్నల్ ఆటోమేటిక్‌గా ఎరుపు రంగులోకి మారుతుంది. దీంతో ఆ ట్రాక్‌పైకి వేరే ట్రైన్‌ను అధికారులు అనుమతించరు. ట్రైన్ ప్రమాదాలను తగ్గించడంలో ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. రైళ్లు ఢీకొట్టుకోవడం, పట్టాలు తప్పిన బోగీలపై మరో రైలు వెళ్లడం లాంటి ప్రమాదాలను నివారిస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది పనిచేస్తుంది. భారీ వరదలు, వర్షాల సమయంలో కూడా ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీంతో రైల్వే భద్రతలో ఈ బాక్సులు అనేవి ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఆ సెన్సార్లు రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి. ఇంటర్ లాకింగ్ వ్యవస్థ కూడా దీని సమాచారం ఆధారంగా పనిచేస్తుందట.

Follow Us