AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Formula: మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా?.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పండిలా!

జీవితంలో ఎదగాలని, ఏదైనా సాధించాలని తపనపడే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి.. "నిన్ను తక్కువ అంచనా వేసే మనుషులు". నువ్వు ఈ పని చేయలేవు, నీకు అంత సీన్ లేదు, నీ వల్ల కాదు అంటూ మన చుట్టూ ఉండే కొందరు బంధువులు, స్నేహితులు లేదా ఆఫీస్ కొలీగ్స్ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయాల్లో కోపంతో వారితో గొడవ పడటమో, లేదా బాధపడుతూ కూర్చోవడమో చేస్తుంటాం.

Success Formula: మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా?.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పండిలా!
How To Handle People Who Underestimate You
Bhavani
|

Updated on: Jun 01, 2026 | 9:45 PM

Share

సైకాలజీ, విజయవంతమైన వ్యక్తుల చరిత్రలను గమనిస్తే.. మనల్ని తక్కువ అంచనా వేసే వారికి ఇచ్చే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ గొడవ పడటం కాదు.. మన ఎదుగుదలతోనే వారి ముఖం మాడిపోయేలా చేయడం. మరి ఒక్క మాట కూడా అనకుండా, మీ టాలెంట్‌తో వారి మైండ్ బ్లాక్ అయ్యేలా ఎలా సమాధానం చెప్పాలో.. అందుకు సంబంధించిన పవర్‌ఫుల్ సైకాలజికల్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. నిశ్శబ్దమే మీ మొదటి ఆయుధం ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వెంటనే వాదించడం, “నేనేంటో నిరూపిస్తా” అని సవాళ్లు చేయడం వల్ల మీ ఎనర్జీ వృథా అవుతుంది. దానికి బదులు కేవలం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకోండి. మీ నిశ్శబ్దం వారిని గందరగోళంలో పడేస్తుంది. మీ ప్లాన్స్ ఏంటో, మీరు ఏం చేయబోతున్నారో ఎవరికీ చెప్పకండి. మీ పని రాత్రింబవళ్లు సైలెంట్‌గా జరిగిపోవాలి.

“మీరు చేసే పని నిశ్శబ్దంగా ఉండాలి.. కానీ మీ విజయం సృష్టించే శబ్దం ప్రపంచానికి వినిపించాలి.”

2. మీ ఫోకస్ మార్చండి – అవమానాన్ని ఇంధనంగా చేసుకోండి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి మాటలను తలచుకుని బాధపడటం మానేసి, ఆ మాటలనే మీ విజయానికి ఇంధనంగా మార్చుకోండి. వారు అన్న ప్రతి మాట మీలో మరింత పట్టుదలను పెంచాలి. మీ పూర్తి దృష్టిని మీ స్కిల్స్ పెంచుకోవడంపై, మీ కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకోవడంపైనే పెట్టండి. వారు మిమ్మల్ని ఎక్కడైతే ఫెయిల్ అవుతారన్నారో, అక్కడ మీ రికార్డులు తిరగరాయాలి.

3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ – కూల్‌గా ఉండటం మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు మీలో కోపాన్ని లేదా నిరాశను చూడాలని ఆశిస్తారు. మీరు గనుక బాధపడితే వారు గెలిచినట్లే. కాబట్టి, వారి ముందు ఎప్పుడూ అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా కనిపించండి. మీ సంతోషమే వారికి పెద్ద శిక్ష. మీ ఎమోషన్స్‌పై మీకు నియంత్రణ ఉన్నప్పుడు.. ఎదుటివారి మాటలు మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు.

4. ఊహించని రేంజ్‌లో ‘మాసివ్ సక్సెస్’ అందుకోవడం ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినప్పుడు వారికి చెప్పే ఏకైక పవర్‌ఫుల్ సమాధానం.. “మాసివ్ సక్సెస్” (భారీ విజయం). మీరు సాధించిన విజయాలు చూసి వారు నోరెళ్లబెట్టాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని, సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబడినప్పుడు.. మిమ్మల్ని విమర్శించిన వారే మీతో సెల్ఫీ దిగడానికి, మీతో మాట్లాడటానికి క్యూ కడతారు. అప్పుడు వారి మైండ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుంది.

5. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి సమాజం మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి మీలో ఏదైనా లోపం కారణమైతే.. దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకోండి. మీ నాలెడ్జ్, మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మీ సంపాదనను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి. ఒక ఏడాది పాటు సోషల్ మీడియా, పనికిరాని ముచ్చట్లకు దూరంగా ఉండి మిమ్మల్ని మీరు పూర్తిగా రీబూట్ చేసుకోండి. ఏడాది తర్వాత సరికొత్త మిమ్మల్ని చూసి ప్రపంచం షాక్ అవ్వాల్సిందే.

Follow Us