ఈ పండ్లను గుర్తుపట్టారా? షుగర్ రోగులకు ఇవి వరం లాంటివి
08 April 2026
TV9 Telugu
TV9 Telugu
అంజీర్ పండ్ల గురించి తెలియని వారుండరు. చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు అంజీర్ పండ్లను తినడంవల్ల రక్తం ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది
TV9 Telugu
ముఖ్యంగా ఎండిన అంజీర్ పండ్లను నానబెట్టి తినడంవల్ల రక్తం ఉత్పత్తి పెరిగి, బలహీనత తొలగిపోతుందని చెబుతున్నారు. మలబద్ధకం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు
TV9 Telugu
సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య తగ్గాలంటే రోజూ నానబెట్టిన అత్తిపండ్లను తినాలి. అత్తి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్‌లా పనిచేస్తుంది. రోజూ అంజీరా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మల విసర్జన సులభమవుతుంది
TV9 Telugu
అంజీర్ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌లు సి, ఇ, ఎ కూడా దీనిలో ఉన్నాయి. అందేరూ అంజీర పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది
TV9 Telugu
ఎముకలను పరిపుష్టం చేయడానికి కూడా అంజీర పండ్లు తోడ్పడుతాయి. నానబెట్టిన అంజీర్ పండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటంవల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి
TV9 Telugu
నానబెట్టిన అంజీర్ పండ్లను తినడంవల్ల శరీరంలో ఆక్సిడేషన్ ఒత్తిడి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని కొద్ది మొత్తంలో తినవచ్చు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి
TV9 Telugu
అయితే వీటిలో ఉండే తీపి కారణంగా చాలామంది డయాబెటిస్ రోగులు వీటిని తినేందుకు భయపడతారు. కానీ రోజుకు ఒకట్రెండు తినడంవల్ల ఎలాంటి సమస్యా ఉండదని నిపుణులు చెబుతున్నారు