మీరు మొల‌క‌ల‌ను ఎలా తింటున్నారు..? నేరుగా తిన‌కూడ‌దట

08 April 2026

TV9 Telugu

TV9 Telugu

మొలకలు ఆరోగ్యకరమైన ఆహారం. సలాడ్లు, చాట్స్, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువగా ముడిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది

TV9 Telugu

బరువు తగ్గేందుకు, క్లీన్ ఈటింగ్ డైట్‌లో కూడా మొలకలు విస్తృతంగా సూచిస్తారు. అయితే ఆహారం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా తీసుకుంటామన్నది కూడా అంతే ముఖ్యం

TV9 Telugu

మొలకలు పోషకాలను క‌లిగి ఉన్నప్పటికీ, ప్రతిరోజూ వీటిని ముడిగా తినడం మంచిది కాకపోవచ్చున‌ని నిపుణులు అంటున్నారు. ముడి మొలకలు తినడం వల్ల బ్యాక్టీరియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది

TV9 Telugu

మొలకలు వేడి, తేమ ఉన్న వాతావరణంలో పెరుగుతాయి. ఇదే పరిస్థితులు ఈ.కోలి, సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా పెరగడానికి కూడా అనుకూలంగా ఉంటాయి

TV9 Telugu

మొలకలు తయారీ సమయంలో కలుషితం అయితే ఈ బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం నీటితో కడగడం వల్ల ఇవి పూర్తిగా తొలగిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

అందుకే మొలకలను తేలికగా ఆవిరి పట్టించడం లేదా వేయించడం ద్వారా తినడం సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. స్ప్రౌట్స్‌ను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంగా చాలా మంది భావిస్తారు

TV9 Telugu

అయితే ఇది పూర్తిగా నిజం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల స్ప్రౌట్స్‌లో కేవలం 3-4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది ఇతర ప్రోటీన్ వనరులతో పోలిస్తే తక్కువ

TV9 Telugu

అందువల్ల స్ప్రౌట్స్‌ను ప్రధాన ప్రోటీన్ వనరుగా కాకుండా, ఉపాహారంగా మాత్రమే తీసుకోవడం మంచిది. సరైన ప్రోటీన్ కోసం పప్పులు, పనీర్, గుడ్లు, టోఫు, శనగలు వంటి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు