Team India-WTC: అలా జరిగితేనే.. టీమిండియా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది.. లేదంటే కథ కంచికే..!

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దాదాపుగా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో..

Team India-WTC: అలా జరిగితేనే.. టీమిండియా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది.. లేదంటే కథ కంచికే..!
WTC Chances for Team India
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 04, 2023 | 8:25 AM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో.. భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది.ఫలితంగా ఈ ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. అయితే భారత్ పరిస్థితే ఇంకా అగమ్యగోచరంగా తయారైంది. ఇండోర్ టెస్ట్ గెలిస్తే ఫైనల్‌కు చేరినట్లే అనుకున్న పరిస్థతి నుంచి ఇతర క్రికెట్ జట్ల మధ్య జరిగే సిరీస్ ఫలితాలపై ఆధారపడే పరిస్థితికి చేరింది టీమిండియా. నిజానికి.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో భారత్ 10 విజయాలతో రెండో స్థానంలో ఉంది. కానీ ఫైనల్స్‌లో అర్హత కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దాదాపుగా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, కనీసం డ్రాగా ముగిసినా.. ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధిస్తుంది.

కానీ ఆ టెస్టులో భారత్ ఓడిపోతేనే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత జట్టు పూర్తిగా శ్రీలంకపై.. ఆ టీమ్ ఆడనున్న టెస్ట్ సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఈ నెలలో అంటే మార్చి 9న శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌ను వెనక్కు నెట్టేసి, శ్రీలంక ఫైనల్స్‌కి చేరుకుంటుంది. ఒకవేళ శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా, డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్స్ అవకాశం కోల్పోయినట్టే..! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ లెక్కన.. శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తేనే, ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందన్నమాట..! అయితే.. న్యూజీలాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నందున, శ్రీలంకకు క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే..! కాబట్టి.. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ గెలుపొందగా, మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో.. 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఓ వైపు నాలుగో మ్యాచ్ గెలిచి ఈ సిరీస్‌ నెగ్గాలని చూస్తుంటే, మరోవైపు నాలుగో టెస్టులోనూ సత్తా చాటి ఈ సిరీస్‌ని డ్రాగా ముగించాలని ఆస్ట్రేలియా చూస్తోంది. మరి ఈ నాలుగో మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!