AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: నేటి నుంచే ఐపీఎల్‌ ధమకా.. మొదటి మ్యాచులో గుజరాత్‌ ముంబయి ఢీ.. ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. మహిళా క్రికెటర్లు ఎన్నాళ్ల నుంచే ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణలకు తెరదించుతూ ఇవాళ్టి (మార్చి 4 ) నుంచి మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానుంది.

WPL 2023: నేటి నుంచే ఐపీఎల్‌ ధమకా.. మొదటి మ్యాచులో గుజరాత్‌ ముంబయి ఢీ.. ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?
Wpl 2023
Basha Shek
|

Updated on: Mar 04, 2023 | 8:43 AM

Share

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. మహిళా క్రికెటర్లు ఎన్నాళ్ల నుంచే ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణలకు తెరదించుతూ ఇవాళ్టి (మార్చి 4 ) నుంచి మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. ముంబై డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగే మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడనున్నాయి. 20 లీగ్ మ్యాచ్‌లు, 2 ప్లే-ఆఫ్‌లతో సహా మొత్తం 23 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. మహారాష్ట్రలోని డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 8 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటాయి. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. లీగ్ దశలో 2వ, 3వ స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఐపీఎల్‌ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇక నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో తమ అత్యద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు ఎన్నో ప్రపంచకప్ ట్రోఫీలను అందించిన బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్.. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

గుజరాత్ జట్టులో హర్లీన్ డియోల్, స్నేహ రాణా, సుష్మా వర్మ ఉన్నారు. ఆష్లే గార్డనర్, జార్జియా వేర్‌హామ్, సోఫీ డంక్లీ ఈ జట్టులోని ప్రధాన విదేశీ ఆటగాళ్లు. అనబెల్‌ సుథర్‌, డియాండ్రా డాటిన్‌ బంతి, బ్యాటుతోనూ దుమ్మురేపుతారు. ఇక ముంబై ఇండియన్స్‌ జట్టులో నథాలీ సివర్ బ్రంట్, ఇసి వాంగ్, అమేలీ కెర్, క్లో ట్రయాన్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ షవర్‌ బ్రంట్‌ స్పిన్‌, పేస్‌ను సునాయసంగా ఆడగలదు. మీడియం పేస్‌ బౌలింగ్‌తోనూ అదరగొట్టగలదు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే పూజా వస్త్రాకర్‌ లోయర్‌ ఆర్డర్లో భారీ సిక్సర్లు కొట్టగలదు. అయితే అటాకింగ్‌ వికెట్‌ కీపర్‌ లేకపోవడం ముంబైకు లోటు. హేలీ మాథ్యూస్‌, అమెలియా కెర్‌ రాణించడం ఈ జట్టుకు ఎంతో కీలకం.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్‌ XI (అంచనా) ఎలా ఉండనుందంటే?

ముంబయి ఇండియన్స్‌

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌, ధారా గుజ్జర్‌, నాట్ షివర్‌ బ్రంట్‌, అమెలియా కౌర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, పూజా వస్త్రాకర్‌, జింతిమని కలితా, ఇస్సీ వాంగ్‌, సోనమ్‌ యాదవ్‌ / సైకా ఇషాకి

గుజరాత్‌ జెయింట్స్‌

బెత్‌ మూనీ (కెప్టెన్‌), సబ్బినేని మేఘన, హర్లీన్‌ డియోల్‌, యాష్ గార్డ్‌నర్‌, డీ హేమలత, డియాండ్రా డాటిన్‌, అనబెల్‌ సుథర్‌ ల్యాండ్‌, స్నేహ్‌ రాణా, హర్లీ గాలా / అశ్విని కుమారి, మానసి జోషి / మోనికా పటేల్‌, తనుజా కన్వార్‌

కియారా, కృతి సనన్‌ల స్టేజ్‌ ఫెర్మామెన్స్‌

కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ జరగనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కియారా అద్వానీ, కృతి సనన్ తదితరులు తమ స్టేజ్‌ ఫెర్మామెన్స్‌తో అలరించనున్నారు. అలాగే ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పాటను పాడనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..