Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: క్రికెట్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. శనివారం నుంచే ఐపీఎల్‌ ధనాధన్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

క్రికెట్‌ ఫ్యాన్స్‌ అమితాసక్తితో ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌కు ముహూర్తం దగ్గరపడింది. శనివారం (మార్చి 4) ఈ మెగా క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమవుతుంది.

WPL 2023: క్రికెట్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. శనివారం నుంచే ఐపీఎల్‌ ధనాధన్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
Wpl 2023
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2023 | 8:47 PM

క్రికెట్‌ ఫ్యాన్స్‌ అమితాసక్తితో ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌కు ముహూర్తం దగ్గరపడింది. శనివారం (మార్చి 4) ఈ మెగా క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమవుతుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌కు ముందు గ్రాండ్‌గా ఓపెనింగ్‌ సెర్మెనీ ఉంటుంది. కాగా తొలి సీజన్‌లో మొత్తం ఐదు జట్లు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత లీగ్ రౌండ్, ఎలిమినేటర్, ఆపై ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న హర్మన్‌ప్రీత్ కౌర్‌ ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనుంది. మరోవైపు, గుజరాత్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీని ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల T20 ఛాలెంజ్‌లో తన జట్టును సూపర్‌నోవాస్ ఛాంపియన్‌గా చేసింది. అదే సమయంలో బెత్ మూనీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు పలు ప్రపంచ కప్ ట్రోఫీలను అందించింది.

కాగా మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుక మార్చి 4 సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 7 గంటలకు గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ అవుతాయి. అలాగే జియో సినిమా యాప్‌లోనూ లైవ్‌ మ్యాచ్‌లను చూడవచ్చు.

ముంబై ఇండియన్స్ జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), యాస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, నేట్ సివర్, ధరా గుజ్జర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, సి వాంగ్, హీథర్ గ్రహం, పూజిత గ్రహం, జింతీమణి. వస్త్రకర్, అమేలియా

ఇవి కూడా చదవండి

గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్:

బెత్ మూనీ (కెప్టెన్‌), ఆష్లే గార్డనర్, స్నేహ రాణా, మానసీ జోషి, షబ్నమ్ షకీల్, సోఫీ డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, డైలాన్ హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, సుష్మా వర్మ, హర్లీ గాలా, ఎస్ మేఘ్నా , అశ్విని, పరుణికా సిసోడియా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజ్ తరుణ్ వివాదంలో మరో ట్విస్ట్ ఇచ్చిన లావణ్య..
రాజ్ తరుణ్ వివాదంలో మరో ట్విస్ట్ ఇచ్చిన లావణ్య..
BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 5 నెలల చెల్లుబాటుతో చౌకైన రీఛార్జ్
BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 5 నెలల చెల్లుబాటుతో చౌకైన రీఛార్జ్
ఇంట్లో సంపద కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే.. మిస్సవ్వకండి
ఇంట్లో సంపద కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే.. మిస్సవ్వకండి
పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్..
పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్..
ఇదేందిది నేనేడా చూడలే.! గర్ల్‌ ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్తానంటే..
ఇదేందిది నేనేడా చూడలే.! గర్ల్‌ ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్తానంటే..
అందం ఈమె రూపం పొందడానికి ఈ జన్మలు వేచి చూసిందో.. చార్మింగ్ ఈషా..
అందం ఈమె రూపం పొందడానికి ఈ జన్మలు వేచి చూసిందో.. చార్మింగ్ ఈషా..
ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో
ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో
కేవలం రూ.6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్స్‌ అదుర్స్
కేవలం రూ.6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్స్‌ అదుర్స్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఎల్ 2: ఎంపురాన్..
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఎల్ 2: ఎంపురాన్..
ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన