సినిమా లవర్స్‌కు బంపరాఫర్‌.. ఒక సినిమా టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే.. పూర్తి వివరాలివే

సినిమా ప్రియుల కోసం ఫఠాన్‌ చిత్రబృందం ఒక శుభవార్త చెప్పింది. షారుఖ్‌ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది.

సినిమా లవర్స్‌కు బంపరాఫర్‌.. ఒక సినిమా టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే.. పూర్తి వివరాలివే
Cinema Tickets
Follow us
Basha Shek

|

Updated on: Mar 02, 2023 | 10:25 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె నటించిన చిత్రం పఠాన్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం విలన్‌గా నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలైంది. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సినిమా ప్రియుల కోసం ఫఠాన్‌ చిత్రబృందం ఒక శుభవార్త చెప్పింది. షారుఖ్‌ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది పఠాన్‌ మూవీ యూనిట్‌. పఠాన్ కోడ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు ఈ క్రేజీ ఆఫర్‌తో ఎంచక్కా థియేటర్లలో చూసేయండి మరి. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమాలో డింపుల్‌ కపాడియా, అశుతోష్‌ రాణా కీ రోల్స్‌ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..