ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సింధు తులానీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

ఒక చిన్న సినిమాతో అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సింధు తులానీ. ఐతే తర్వాత కల్యాణ్‌ రామ్‌ అతనొక్కడే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ మూవీని ఖాతాలో వేసుకుంది. గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సింధు తులానీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Actress Sindhu Tolani
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 7:10 AM

2003లో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ఐతే. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఒక ముంబై భామ అడుగుపెట్టింది. పుట్టి, పెరిగింది ముంబై అయినా చూడడానికి అచ్చం పక్కింటమ్మాయిలా కనిపించింది. అలా ఒక చిన్న సినిమాతో అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సింధు తులానీ. ఐతే తర్వాత కల్యాణ్‌ రామ్‌ అతనొక్కడే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ మూవీని ఖాతాలో వేసుకుంది. గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక శింబు మన్మథ సినిమాలో సింధు పోషించిన నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక తెలంగాణ బతుకమ్మ నేపథ్యంలో వచ్చిన బతుకమ్మ సినిమాలోనూ మెయిన్‌ లీడ్‌లో నటించి మెప్పించింది. సామాజిక సమస్యలపై తెరకెక్కిన పోతేపోనీ సినిమాలోనూ నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను పోషించింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే 2011 ఆది ప్రేమ కావాలి సినిమాలో మళ్లీ కనిపించి ఆశ్చర్యపరిచింది. దీని తర్వాత ఇష్క్‌ సినిమాలో నితిన్‌ అక్కగా కనిపించిన సింధు సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాల్లో అల్లు అర్జున్‌ వదిన పాత్రలో నటించి మెప్పించింది.

కెరీర్‌ ప్రారంభంలో తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ అందాల తార ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. 2017 తర్వాత సింధు మరే సినిమాలోనూ కనిపించలేదు. కాగా సోషల్‌ మీడియాలోనూ పెద్దగా కనిపించని సింధు తులానీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో స్థిరపడింది. సింధు భర్త పేరు చేతన్‌. అతను నార్త్ ఇండియన్‌. ఐటీ ఆఫీసులో చేతన్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరికి శ్వేత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తన కూతురు ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది సింధు.

ఇవి కూడా చదవండి
Sindhu Tolani

Sindhu Tolani

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
మాసశివరాత్రి నుంచి ఈ3రాశులకు లక్కేలక్కు మీరున్నారా చెక్ చేసుకోండి
మాసశివరాత్రి నుంచి ఈ3రాశులకు లక్కేలక్కు మీరున్నారా చెక్ చేసుకోండి
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
గృహరుణం చెల్లించనందుకు రికవరీ ఏజెంట్ వేధిస్తున్నారా? రూల్స్‌ ఏంటి
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2రోజుల వాతావరణ సూచనలివే..
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో..
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
సోషల్ మీడియాలో ఫేక్ కామెంట్స్ ను ఖండించిన కుంబ్లే!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
భారత్ ను కాపాడిన వర్షం.. గందరగోళంలో WTC ఫైనల్ ఆశలు!
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్
అభినవ మీరా భాయి భారతి అరోరా.. కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్