Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం పంచుకున్న నటి లయ.. మురిసిపోతోన్న మెగా ఫ్యాన్స్‌

సినిమాల్లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే యోచనలో ఉన్న లయ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన సినిమా కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గురించి లయ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం పంచుకున్న నటి లయ.. మురిసిపోతోన్న మెగా ఫ్యాన్స్‌
Laya, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 12:17 AM

తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినా అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లయ. స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘మనోహరం’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘మిస్సమ్మ’, ‘ప్రేమించు’, ‘శివరామరాజు,’, ‘స్వరాభిషేకం’ తదితర హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అయితే సినిమాల్లో బిజీ ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. వివాహనంతరం నటనకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తెలుగు సూపర్‌ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటోంది. కాగా సినిమాల్లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే యోచనలో ఉన్న లయ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన సినిమా కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గురించి లయ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇవి మెగాభిమానులందరినీ ఖుషీ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 2006లో శ్రీ గణేష్‌తో కలిసి లయ పెళ్లిపీటలెక్కింది. తమ వివాహానికి మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ని ఆహ్వానించేందుకు వెళ్లారట. అయితే చిరంజీవితో తనకు కాస్త పరిచయం ఉంది కానీ, పవన్‌తో ఆమెకు అస్సలు పరిచయం లేదట. పవన్ కల్యాణ్‌కి కూడా తనెవరో తెలిసి ఉండకపోవచ్చుననీ భావిస్తూనే వెళ్లి ఆయనకు శుభలేఖ ఇచ్చారట. ఆసమయంలో ఎలాంటి అపాయింట్‌మెంట్ కూడా లేకుండా వెళ్లిన లయని పవన్ ఆహ్వానించిన తీరు, శుభలేక తీసుకుని.. కచ్చితంగా వస్తానని ఆయన చెప్పిన తీరు చూసి లయ ఆశ్చర్యపోయారట. అప్పుడు కూడాడా.. తన వివాహానికి చిరంజీవి వస్తారేమో కానీ.. పవన్ కల్యాణ్ రారనే అనుకుందట ఈ అందాల తార.

వస్తారనుకోలేదు.. కానీ..

కట్ చేస్తే.. లయ పెళ్లికి అందరి కంటే ముందే పవన్ కల్యాణ్ వచ్చేశారట. ఎటువంటి సమాచారం లేకుండా, చాలా సింపుల్‌గా ఆయన వచ్చారని.. కనీసం అతిథి మర్యాదలు చేసే అవకాశం కూడా తనకి ఇవ్వలేదట. ‘ మా పెళ్లి వేడుకకు అందరి కంటే ముందు పవన్‌ వచ్చి మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా ఆయన చాలా సింపుల్‌గా రావడం చూసి నేను షాక్‌ అయ్యా. పవన్‌ వస్తారని ముందుగా తెలియకపోవడంతో మర్యాదలు చేయలేకపోయాం. ‘అన్నయ్య (చిరంజీవి)ను కూడా పిలిచావు కదమ్మా. ఆయన దారిలో ఉన్నారు.. వస్తున్నారు’ అని మాతో చెప్పారు. ఆ అమితానందంలో ఏం చేయాలో మాకు అర్థంకాలేదు. థ్యాంక్స్‌ మాత్రం చెప్పా. చిరంజీవిగారితో నాకు పరిచయం ఉండడం, ఆయన ఇండస్ట్రీకి పెద్ద కాబట్టి వచ్చారంటే ఓ అర్థం ఉంది. పవన్‌ కల్యాణ్‌ గారికి నా పెళ్లికి రావాల్సిన అవసరంలేదు.. అయినా వచ్చారంటే ఆయన వ్యక్తిత్వమేంటో అర్థమవుతుంది’ అని పవర్‌స్టార్‌పై ప్రశంసలు కురిపించారు లయ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మెగాభిమానులను తెగ ఖుషీ చేస్తున్నాయి. మా పవర్‌ స్టార్‌ అంతే.. ఒక్కసారి మాటిస్తే.. కచ్చితంగా నిలబెట్టుకుంటారంతే’ అంటూ మురిసిపోతున్నారు.

Laya, Pawan Kalyan 1

Laya, Pawan Kalyan

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి