AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లతోనే కుర్రాళ్ల హృదయాలకు గాలమేస్తోన్న ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డమ్‌..

కళ్లతోనే కనికట్టు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. స్టార్‌ హీరోలు, యంగ్‌ స్టార్స్‌తో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది

కళ్లతోనే కుర్రాళ్ల హృదయాలకు గాలమేస్తోన్న ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డమ్‌..
Actress
Basha Shek
|

Updated on: Feb 28, 2023 | 6:12 AM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక సెలబ్రిటీలు, అభిమానులకు దూరం బాగా తగ్గిపోయింది. సినిమా తారలు నిత్యం తమ గ్లామరస్‌ ఫొటోలు, ఫ్యాషనబుల్ ఫిక్స్‌ షేర్‌ చేసుకోవడం, ఫ్యాన్స్‌ వాటిని షేర్‌ చేస్తూ వైరల్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. పై ఫొటో కూడా అలాంటిదే. పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న ఓ స్టార్‌ హీరోయిన్‌ ఈ ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. అలా షేర్‌ చేసిందో లేదో.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కళ్లతోనే కనికట్టు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. స్టార్‌ హీరోలు, యంగ్‌ స్టార్స్‌తో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఆమె చేతిలో ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంతకీ కళ్లతోనే కుర్రాళ్ల హృదయాలకు గాలమేస్తోన్న ఈ కుందనపు బొమ్మ మరెవరో కాదు..

బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ కృతి సనన్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలను ఫ్యాన్స్‌ తో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక ఆమె సినిమా కెరీర్‌ విషయానికొస్తే.. మహేశ్‌బాబు- సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆతర్వాత నాగచైతన్యతో దోచేయ్‌ సినిమాలో సందడి చేసింది. అయితే పెద్దగా క్లిక్‌ కాలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోపంటి, దిల్‌వాలే, రాబ్తా, బరేలీ కీ బర్ఫీ, స్త్రీ, లుకాచుప్పి, హౌస్‌ఫుల్‌ 4, పతీ పత్నీ ఔర్‌ వో, మిమి, భేడియా, షెహ్‌జాద సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అనుభవిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్‌లో ఆమె సీతగా నటిస్తోంది. దీంతో పాటు గణ్‌పత్‌ అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!