Viswanath: మరణంలోనూ వీడని బంధం.. విశ్వనాథ్‌ కన్నుమూసిన వార్డులోనే ప్రాణాలు వదిలిన సతీమణి

జీవితాంతం కష్ట సుఖాలు కలిసి పంచుకున్న భర్త లేని లోకంలో తాను ఉండలేననుకుందేమో.. విశ్వనాథ్‌ కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా తుదిశ్వాస విడిచారు.

Viswanath: మరణంలోనూ వీడని బంధం.. విశ్వనాథ్‌ కన్నుమూసిన వార్డులోనే ప్రాణాలు వదిలిన సతీమణి
Viswanath Wife Jayalakshmi
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2023 | 6:29 AM

జీవితాంతం కష్ట సుఖాలు కలిసి పంచుకున్న భర్త లేని లోకంలో తాను ఉండలేననుకుందేమో.. విశ్వనాథ్‌ కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం (ఫిబ్రవరి 26) సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అయితే విశ్వనాథ్‌ మరణం తర్వాత జయలక్ష్మి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే ఆదివారం పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. అయితే విశ్వనాథ్‌ కన్నుమూసిన వార్డులోనే జయలక్ష్మి కూడా మరణించడం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 2న కె.విశ్వనాథ్‌ శివైక్యమయ్యారు. ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విశ్వనాథ్‌-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్‌, కాశీనాథుని రవీంద్రనాథ్‌ ముగ్గురు సంతానం.

జగన్‌, పవన్‌ల సంతాపం..

కాగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీరి పెద్ద కుమారుడికి కబురు అందించారు కుటుంబ సభ్యులు. ఆయన వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు విశ్వనాథ్‌ సతీమణి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జయలక్ష్మి మృతికి సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!