- Telugu News Photo Gallery Cricket photos Team India all rounder shardul thakur getting married on 27 february with friend Mittali Parulkar
బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పనున్న మరో టీమిండియా క్రికెటర్.. మిథాలీ మెడలో మూడు మూళ్లు వేయనున్న శార్దూల్
ఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తర్వాత ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పనున్నాడు. ఈ టీమిండియా ఆల్‌రౌండర్ ఫిబ్రవరి 27న మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. నవంబర్ 2021లో శార్దూల్, మిథాలీ నిశ్చితార్థం చేసుకున్నారు.
Updated on: Feb 26, 2023 | 6:25 AM

కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తర్వాత ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పనున్నాడు. ఈ టీమిండియా ఆల్‌రౌండర్ ఫిబ్రవరి 27న మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. నవంబర్ 2021లో శార్దూల్, మిథాలీ నిశ్చితార్థం చేసుకున్నారు.

వివిధ కారణాలతో కొన్ని నెలలుగా శార్దూల్, మిథాలీ పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అయితే ముందుగా అనుకున్నట్లు గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ క్యాన్సిల్ అయ్యింది.

ముంబైలోని సమీపంలోనే శార్దూల్, మిథాలీల పెళ్లి వేడుక జరగనుంది. వీరి వివాహమహోత్సవానికి 200 నుంచి 250 వరకు అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

శార్దూల్, మిథాలీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా హల్దీ, మెహిందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో శార్దూల్, తన కుటుంబ సభ్యులతో అదిరిపోయే డ్యాన్స్ చేశాడు.

శార్దూల్‌కు కాబోయే భార్య మిథాలీ విషయానికొస్తే.. ఆమె మోడలింగ్ చేసింది. అలాగే పలు కంపెనీల్లో సెక్రటరీగా విధులు నిర్వర్తించింది. ఇదిలా ఉంటే తమ వివాహ కేక్‌ను మిథాలీనే స్వయంగా తయారుచేయనుంది.





























