- Telugu News Photo Gallery Cricket photos Delhi Capitals Director Saurav Ganguly says these 5 youngsters will make big name for them in IPL 2023
IPL 2023: ‘రానున్న ఐపీఎల్ టోర్నీలో ఈ ఐదుగురు అదరగొడతారు’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్..
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టే ఐదుగురు యువ ఆటగాళ్లు ఎవరనే ప్రశ్నకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Updated on: Feb 26, 2023 | 7:40 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో రాబోయే ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ఆటగాళ్లు ఎవరో చెప్పాడు. ఈ క్రమంలోనే రానున్న సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కానీ ఈ సీజన్‌లో మెరిపించగల యువ ఆటగాళ్ల జాబితాలో అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ ఐదుగురు ఆటగాళ్లు ప్రకంపనలు సృష్టించబోతున్నారని గంగూలీ అన్నాడు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో మనం ఇప్పుడు ఓ లుక్కెద్దాం..

పృథ్వీ షా(ఢిల్లీ క్యాపిటల్స్): ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీ షా రానున్న రోజుల్లో అద్భుతంగా రాణిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే అతడి వయసు ఇప్పుడు 23 ఏళ్లు మాత్రమే. ఈ కారణంగానే భవిష్యత్తులో పృథ్వీ అద్భుతంగా రాణిస్తాడని గంగూలీ అన్నాడు.

రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్): ఐపీఎల్ సీజన్ 16లో రిషబ్ పంత్ కనిపించడం లేదు. అయితే 25 ఏళ్ల ఈ యువకుడు రానున్న రోజుల్లో ఐపీఎల్‌లో సంచలనం సృష్టిస్తాడని దాదా జోస్యం చెప్పాడు.

శుభ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్): శుభ్‌మన్ గిల్ కూడా గుజరాత్ జట్టు ఓపెనింగ్ ప్లేయర్‌గా 23 ఏళ్ల ఆటగాడే. ఇప్పటికే తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్న గిల్ ఐపీఎల్‌లో మెరుస్తాడనడంలో సందేహం లేదని గంగూలీ అన్నాడు.

రుతురాజ్ గైక్వాడ్(చెన్నై సూపర్ కింగ్స్): సీఎస్‌కే తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ భవిష్యత్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రుతురాజ్ రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా ఎదుగుతాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఉమ్రాన్ మాలిక్(సన్‌రైజర్స్ హైదరాబాద్): 23 ఏళ్ల యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో ఉమ్రాన్ కూడా సంచలనం సృష్టిస్తాడని సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు.





























