- Telugu News Sports News Cricket news Cricketer dinesh karthik wife indian squash player dipika pallikal intersting lover story
Team India: అందంలోనే కాదు.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతోనూ సంచలనమే.. ఈ క్రికెటర్ భార్య ఎవరో తెలుసా?
భారతదేశపు స్టార్ స్క్వాష్ క్రీడాకారిణిగా పేరుగాంచిన ఈ క్రికెటర్ భార్య.. భారత్‌కు పలు ఈవెంట్లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటింది.
Updated on: Feb 25, 2023 | 5:57 PM

దీపిక పల్లికల్ భారతదేశపు ప్రసిద్ధ స్క్వాష్ క్రీడాకారిణిగా పేరుగాంచింది. దీపిక భారత్‌కు పలు ఈవెంట్లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక భారత్‌కు పతకాలు అందించింది.

దీపికా పల్లికల్ భారతదేశంలోని అత్యుత్తమ స్క్వాష్ క్రీడాకారిణులలో ఒకరనే విషయం తెలిసిందే. కాగా, దీపిక క్రీడా కుటుంబానికి చెందినది. ఆమె తల్లి సుసాన్ ఇటిచెరియా భారత జట్టు తరపున వన్డే, టెస్ట్ క్రికెట్ ఆడింది.

ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (PSA) మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలుగా దీపిక నిలిచింది. దీపిక తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. దీపిక 2006 నుంచి తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో కాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో జరిగిన ఆరెంజ్ కౌంటీ ఓపెన్‌ని గెలుచుకోవడం ద్వారా తన మొదటి మేజర్ టైటిల్‌ను గెలుచుకుంది.

2012లో న్యూయార్క్‌లో జరిగిన ఛాంపియన్స్ స్క్వాష్ మీట్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా దీపిక నిలిచింది. దీపిక్ తన కెరీర్ ప్రారంభం నుంచి భారత ప్రధాన ప్లేయర్‌గా మారింది.

దీపిక 2015 ఆగస్టులో భారత క్రికెటర్ దినేష్ కార్తీక్‌ను వివాహం చేసుకుంది. దీపికను దినేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ తన భార్య నికితా వంజారాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు దీపికకు క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.

వీరిద్దరి భేటీ చాలా అపూర్వంగా జరిగింది. దీపిక, కార్తీక్ ఇద్దరూ ఒకే కోచ్ వద్ద ఫిట్‌నెస్ కోచింగ్ తీసుకునేవారు. ఆ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. కార్తీక్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దీపికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ 2015 ఆగస్టు 18న పెళ్లి చేసుకున్నారు.

కార్తీక్, దీపిక రెండు విధాలుగా వివాహం చేసుకున్నారు. మొదట హిందూ ఆచారంలో, రెండోసారి క్రైస్తవ ఆచారంలో చేసుకున్నారు. మొదట్లో కార్తీక్ ఆట కారణంగా దీపికకు అంతగా నచ్చలేదు.

కార్తీక్ మొదటి భార్య నిఖిత వంజరతో చాలా ఇబ్బందులు పడ్డాడు. కార్తీక్ తోటి క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖిత ప్రేమ వ్యవహారం నడిపించడంతో, కార్తీక్, నిఖితల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కార్తీక్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలోనే దీపికా పల్లికల్ పరిచయం అవ్వడంతో.. కార్తీక్ మరలా క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.




