Ind Vs Aus: నంబర్ వన్ టూ ఫైనల్ టికెట్.. భారీ రికార్డ్ దిశగా రోహిత్ సేన.. టీమిండియా హిస్టరీలోనే తొలిసారి..
భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్‌లో ప్రారంభం కానుంది. అందరి చూపు ఈ మ్యాచ్‌పైనే నెలకొంది. ఇక్కడ భారత్ గెలిస్తే సిరీస్‌నే కాకుండా మరో రెండు భారీ బహుమతులు అందుకోనుంది.
WTC Final 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ టెస్టు మ్యాచ్ మార్చి 1 నుంచి జరగనుంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఇది మూడో టెస్టు. సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని, వరుసగా నాలుగోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తోంది.
అయితే ఇండోర్ టెస్టులో టీమిండియా గెలిస్తే సిరీస్‌నే కాకుండా మరో రెండు భారీ బహుమతులు అందుకోనుంది. ఈ టెస్టులో గెలిచిన తర్వాత, టీమిండియా అధికారికంగా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1గా మారవచ్చు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌కు చేరుకోవచ్చు.
ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నంబర్-1, భారత్ నంబర్-2 స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా 126, భారత్ 115 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇండోర్ టెస్టులో గెలిస్తే రేటింగ్‌ల్లో మార్పులు వస్తాయి. ఇండోర్ టెస్టులో టీమిండియా గెలిస్తే 121 రేటింగ్ పాయింట్లు, ఆస్ట్రేలియాకు 119 పాయింట్లు ఉంటాయి.
అంటే టీమిండియా నంబర్-1 స్థానంలో ఉండనుంది. ఇది జరిగితే టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఎందుకంటే టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే నంబర్-1గా ఉన్న టీమిండియా.. టెస్టుల్లోనూ నంబర్-1గా మారనుంది. ఇది కాకుండా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అధికారికంగా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది.
టాప్-2 జట్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకోగలవు. టీమిండియా ప్రస్తుతం నంబర్-2లో ఉంది. ఇండోర్ టెస్టులో గెలిస్తే టీమిండియా స్థానం సుస్థిరం చేసుకోనుంది. అంటే జూన్‌లో జరిగే ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా పోరు ఖాయమైనట్లేనని తెలుస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023..
• 1వ టెస్టు – భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలిచింది.
• 2వ టెస్టు – భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
• 3వ టెస్ట్ – మార్చి 1 నుంచి 5 వరకు, ఇండోర్.
• 4వ టెస్ట్ – మార్చి 9 నుంచి 13 వరకు, అహ్మదాబాద్.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..