AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: ఓటీటీలో అడుగుపెట్టిన వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్‌కు వెళ్లలేని వారు.. అలాగే మరోసారి తమ అభిమాన హీరోని ఒకటికి రెండు సార్లు చూసుకోవడానికి.. వీరయ్య ఓటిటి డేట్ కోసం ఎదురు చూడ సాగారు. ఇ

Waltair Veerayya: ఓటీటీలో అడుగుపెట్టిన వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Waltair Veerayya Ott
Basha Shek
|

Updated on: Feb 27, 2023 | 6:00 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్‌ సినిమా వాల్తేరు వీరయ్య. కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యాథరీన్‌ థెరిస్సా ఓ కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక ఓవర్సీస్‌లోనూ 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. థియేటర్లో బ్లాక్‌ బస్టర్‌ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్‌కు వెళ్లలేని వారు.. అలాగే మరోసారి తమ అభిమాన హీరోలైన చిరంజీవి, రవితేజలను ఒకటికి రెండు సార్లు చూసుకోవడానికి.. వీరయ్య ఓటిటి డేట్ కోసం ఎదురు చూడ సాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తికావడంతో ఇవాళ (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ఓటీటీలో మెగా మాస్‌ యాక్షన్‌ షురూ కానుంది.

మరోవైపు థియేటర్లలో బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడోనని మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వారలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. మరి థియేటర్లలో వాల్తేరు వీరయ్య సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..