Ram Charan: ఇది కదా ఫ్రెండ్‌షిప్‌ అంటే.. రామ్ చరణ్ చేసిన పనికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఫిదా

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు ఎంత మంచి ఫ్రెండ్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఆ బంధం మరింత బలపడింది.

Ram Charan: ఇది కదా ఫ్రెండ్‌షిప్‌ అంటే.. రామ్ చరణ్ చేసిన పనికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఫిదా
Ramcharan, Jr. Ntr
Follow us
Basha Shek

|

Updated on: Feb 26, 2023 | 6:12 AM

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు ఎంత మంచి ఫ్రెండ్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆ బంధం మరింత బలపడింది. కొమురం భీమ్‌గా తారక్‌, సీతరామరాజుగా చరణ్‌ ఇద్దరూ ఈ సినిమాలో తమ నట విశ్వ రూపాన్ని చూపించారు. అందుకే అంతర్జాతీయ అవార్డులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెల్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదింటినీ తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు రామ్ చరణ్, తారక్‌. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై ఉన్న తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు చెర్రీ. ‘బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా నా అన్న ఎన్టీఆర్ పేరుతో పాటుగా నా పేరును చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదీకాక మా పేర్లు హాలీవుడ్ దిగ్గజాలు అయిన నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లతో కలిసి ఉండటం గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది’ అని ట్విట్టర్‌ వేదికగా రామ్ చరణ్ రాసుకొచ్చారు.

ప్రస్తుతం చెర్రీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ ద్వారా తారక్‌తో తనకెలాంటి స్నేహం ఉందో మరోసారి చాటి చెప్పాడంటున్నారు ఫ్యాన్స్‌. అదే సమయంలో మెగా హీరో ట్వీట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన ఫ్రెండ్‌షిప్‌ అంటే! అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కాగా హాలీవుడ్​లో విశేషంగా భావించే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల్లో ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ,’ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు)’, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో సత్తాచాటింది ఆర్‌ఆర్‌ఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!