గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ జల్సా మూవీ సెకెండ్‌ హీరోయిన్‌.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

పేరుకు సెకెండ్‌ హీరోయిన్‌ అయినా తన స్ర్కీన్‌ ప్రజెన్స్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేసింది పార్వతి మెల్టన్‌. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామరస్‌ లుక్‌లో కనిపించిందామె. అంతకుముందు కొన్ని సినిమాల్లోనూ నటించినప్పటికీ జల్సా సినిమాతోనే బాగా ఫేమస్‌ అయిపోయింది పార్వతి.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ జల్సా మూవీ సెకెండ్‌ హీరోయిన్‌.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Parvati Melton
Follow us
Basha Shek

|

Updated on: Feb 25, 2023 | 6:15 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌లో జల్సా ఒకటి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా ఇలియానా నటించగా, సెకెండ్‌ హీరోయిన్‌గా పార్వతి మెల్టన్‌ కనిపించింది. పేరుకు సెకెండ్‌ హీరోయిన్‌ అయినా తన స్ర్కీన్‌ ప్రజెన్స్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేసింది పార్వతి మెల్టన్‌. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామరస్‌ లుక్‌లో కనిపించిందామె. అంతకుముందు కొన్ని సినిమాల్లోనూ నటించినప్పటికీ జల్సా సినిమాతోనే బాగా ఫేమస్‌ అయిపోయింది పార్వతి. అయితే ఆతర్వాత హీరోయిన్‌గా పెద్దగా రాణించలేకపోయింది. కెరీర్‌ ఆరంభంలో వెన్నెల లాంటి ఫీల్‌ గుడ్‌ మూవీస్‌ లో హీరోయిన్‌గా చేసిన ఆమె మంచు విష్ణుతో కలిసి గేమ్‌, అల్లరే అల్లరి, మధుమాసం వంటి సినిమాల్లో సెకెండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆతర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ కనువిందు చేసింది. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఆమె సాగే ఈ పాట అప్పట్లో యూట్యూబ్‌ను షేక్‌ చేసింది.

బాలకృష్ణతో కలిసి శ్రీమన్నారాయణ, సాయిరాం శంకర్‌తో కలిసి యమహో యమా అనే సినిమాల్లో నటించింది పార్వతి . వీటి తర్వాత సినిమా ఇండస్డ్రీ నుంచి హఠాత్తుగా మాయమైపోయింది. అవకాశాలు లేకనో ఇతర కారణాల వల్లనో సినిమాల్లో కనిపించడం మానేసిందీ అందాల తార. అయితే 2013లో శంసులాలానిని వివాహం చేసుకున్నపార్వతి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిపోయింది. సినిమాలకు దూరంగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. అయితే ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పార్వతి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమాల్లో నటించేటప్పుడు ఎంతో బొద్దుగా ఉండే ఈ అందాల భామ ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. ఉన్నపళంగా చూస్తే అసలు ఈమె పార్వతి పార్వతీ మెల్టనేనా అనే అనుమానం వచ్చేలా మారిపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..