Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్‌ చరణ్‌ కోసం చిన్నారి కన్నీరు మున్నీరు.. చలించిపోయిన చెర్రీ ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవుతారంతే

తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఫొటో కోసం ఓ చిన్నారి పరితపించిపోయింది. ఏకంగా కంటతడి పెట్టేసింది. దీంతో చిన్నారి కన్నీరు చూసిన చెర్రీ వెంటనే తన సెక్యూరిటీకి నచ్చజెప్పి పాపతో సెల్ఫీ దిగాడు. అంతేకాదు ఆ పాపను ఏడవద్దంటూ ఓదార్చాడు.

Ram Charan: రామ్‌ చరణ్‌ కోసం చిన్నారి కన్నీరు మున్నీరు.. చలించిపోయిన చెర్రీ ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవుతారంతే
Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2023 | 6:20 AM

సినిమా తారలు కనిపిస్తే వారితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగాలని చాలామందికి ఉంటుంది. పెద్దలంటే పట్టించుకోకపోవచ్చు కానీ యువత, పిల్లలు మాత్రం తమ అభిమాన నటీ నటులతో కనీసం ఒక్క ఫొటోనైనా దిగాలనుకుంటారు. అయితే తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఫొటో కోసం ఓ చిన్నారి పరితపించిపోయింది. ఏకంగా కంటతడి పెట్టేసింది. దీంతో చిన్నారి కన్నీరు చూసిన చెర్రీ వెంటనే తన సెక్యూరిటీకి నచ్చజెప్పి పాపతో సెల్ఫీ దిగాడు. అంతేకాదు ఆ పాపను ఏడవద్దంటూ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్ గా జరగనుంది. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ కోసం 20 రోజుల ముందే అమెరికా చేరుకున్నాడు చెర్రీ. అక్కడ వరుసగా టీవీ షోలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లైవ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అయితే ఈ ప్రోగ్రాంకి చరణ్ వస్తున్నాడని తెలిసి.. అభిమానులు భారీ స్థాయిలో స్టూడియో వద్దకు చేరుకున్నారు.

ఇక ప్రోగ్రాం అనంతరం రామ్‌చరణ్‌ బయటకు రాగానే.. ఫ్యాన్స్‌ అంతా సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ తో చుట్టుముట్టేశారు. వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా తీవ్రంగా తంటాలు పడ్డారు. దీంతో మెగా పవర్‌ స్టార్‌ అందరినీ కలిసేందుకు వీలు పడలేదు. ఇదే క్రమంలో చెర్రీతో కలిసి ఫొటో దిగడానికి వచ్చిన ఓ చిన్నారి అది వీలుపడకపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది. అప్పటికే కారు దగ్గరికి వెళ్లిపోయిన చరణ్‌ చిన్నారి ఏడుపు చూసి ఆగిపోయాడు. వెంటనే ఏడుస్తున్న పాప దగ్గరకు వచ్చి షేక్‌ హ్యాండ్ ఇచ్చి ఓదార్చాడు. అప్పుడైతే కానీ పాప ఏడుపు ఆపలేదు. ఇది న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ దగ్గర జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యంగా చిన్నారితో రాంచరణ్ అప్యాయంగా మాట్లాడే తీరు, అలాగే ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిన తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by ROAR OF RRR (@ssrrrmovie)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.