AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌ కల్యాణ్‌ ‘సుస్వాగతం’ సినిమా హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

ముంబైకు చెందిన దేవయాని మొదటగా బాలీవుడ్‌లో కోయల్‌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం రిలీజ్‌ కాలేదు. ఆ తర్వాత తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే తెలుగులో పవన్ కల్యాణ్ సరసన నటించిన సుస్వాగతం చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది.

పవన్‌ కల్యాణ్‌ 'సుస్వాగతం' సినిమా హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Actress Devayani
Basha Shek
|

Updated on: Feb 22, 2023 | 5:30 PM

Share

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సినిమాల్లో సుస్వాగతం ఒకటి. ప్రేమకు సంబంధించి యువత ఆలోచనలను ఎంతో చక్కగా చూపించారీ సినిమాలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లో దేవయాని హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో పవన్‌, దేవయానిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మాక్స్‌లో పవన్‌ నటన అందరినీ కంటతడిపెట్టిస్తుంది. ఇక పవన్‌ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ముంబైకు చెందిన దేవయాని మొదటగా బాలీవుడ్‌లో కోయల్‌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం రిలీజ్‌ కాలేదు. ఆ తర్వాత తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే తెలుగులో పవన్ కల్యాణ్ సరసన నటించిన సుస్వాగతం చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో పవన్‌తో పాటు దేవయానికి కూడా అవకాశాలు పెరిగాయి. దీని తర్వాత శ్రీకాంత్‌తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా తదితర హిట్‌ సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువ రోజులు మాత్రం హీరోయిన్‌గా క్లిక్‌ కాలేకపోయింది.

ఇదే క్రమంలో తమిళ్‌ సినిమా పరిశ్రమకు చెందిన డైరెక్టర్‌ రాజకుమారన్‌తో ప్రేమలో పడింది దేవయాని. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2001 ఏప్రిల్‌ 9న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన దేవయాని చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లెలిగా నటించింది. అలాగే నాని సినిమాలో మహేశ్‌కు తల్లిగా కనిపించింది. అలాగే జనతా గ్యారేజ్‌, అరవింద సమేత, ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం విషయానికొస్తే.. అడపాదడపా సినిమాల్లో తల్లి, అక్క, చెల్లి పాత్రలు పోషిస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..