Satya Krishnan: నటి సత్యకృష్ణన్‌ కూతురునూ చూశారా? అమ్మను మించిన అందంతో.. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సపోర్టింగ్‌ రోల్స్‌తో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సత్యకృష్ణన్‌. తెలుగులో సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.

Satya Krishnan: నటి సత్యకృష్ణన్‌ కూతురునూ చూశారా? అమ్మను మించిన అందంతో.. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ
Actress Satya Krishnan
Follow us
Basha Shek

|

Updated on: Feb 18, 2023 | 11:35 AM

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సపోర్టింగ్‌ రోల్స్‌తో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సత్యకృష్ణన్‌. తెలుగులో సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. ఆనంద్‌, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, దూకుడు, బాద్‌షా, గోవిందుడు అందరివాడేలే, పిల్లా నువ్వులేని జీవితం, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర హిట్‌ సినిమాలు సత్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆమె వాయిస్‌లో ఉన్న బేస్‌కు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా ఆరంభంలో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ నటి ఇప్పుడు అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. చివరిగా ఆడవాళ్లు మీకు జోహార్లు, 10th క్లాస్‌ డైరీస్‌, అమ్ము అనే సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆమె సోషల్‌ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఇటీవల కొన్ని ఆడియో ఫంక్షన్లలో తన కూతురితో కలిసి తళుక్కున మెరిసింది సత్య కృష్ణన్‌. దీంతో ఇద్దరి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అమ్మను మించిన అందంతో సత్య కూతురు అనన్యా కృష్ణన్‌.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అయితే అనన్య ఇప్పటికే తెలుగులో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’ అనే సినిమాలో కూడా కీరోల్‌ పోషించింది. అయితే తల్లి మాదిరే అనన్య కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కొనసాగుతుందా? లేదా? హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే అనన్యకు ఎలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవని తెలుస్తోంది. కేవలం ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తోంది. ఈక్రమంలోనే అనన్యకి సంబంధించి ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Satya Krishnan, Ananya

Satya Krishnan, Ananya

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?