కాళేశ్వరం ప్రాజెక్టుతో క్రికెటర్‌ అంబటి రాయుడుకు అనుబంధం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు  పురస్కరించుకుని సిద్ధిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌తో సహా హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో క్రికెటర్‌ అంబటి రాయుడుకు అనుబంధం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన మంత్రి హరీశ్‌రావు
Harish Rao, Rayudu, Nani
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2023 | 10:41 AM

‘తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబటి రాయుడు ఎకరంన్నర భూమిని ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నీళ్లతోనే వ్యవసాయం చేస్తున్నారు’ అని నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు  పురస్కరించుకుని సిద్ధిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌తో సహా హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో అంబటి రాయుడుకు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.’ క్రికెటర్‌ అంబటి రాయుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒకటిన్నర ఎకరా భూమి ఇచ్చిండు. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో వ్యవసాయం చేస్తుండు. దేశ జనాభా 140 కోట్లు ఉంటే.. కేవలం 11 మందే క్రికెట్ అడుతారు. అలాంటి 11 మందిలో మన తెలుగుబిడ్డ అంబటి రాయుడు కూడా ఉండడం మన అదృష్టం. సిద్ధిపేటతో అంబటి రాయుడికి మంచి సంబంధం ఉంది’ అని క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించారు మంత్రి హరీశ్‌.

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన అంబటి రాయుడు తాను సీఎం కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకొచ్చాడు.’ సిద్దిపేటకి రావడం చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్లలో ఇండియాలో ఎక్కడా జరగని అభివృద్ధి సిద్దిపేటలో జరిగింది. టీమిండయాలో తెలుగు వాళ్లు చాలా మంది ఆడాలని. సిద్దిపేటలో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు మంత్రి హరీష్ రావు చొరవ చూపాలి’ అని కోరాడు రాయుడు. కాగా తన ట్యాలెంట్‌తో టీమిండియాలో చోటు దక్కించుకున్న అంబటిరాయుడు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. టీమిండియాలో కీలక ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2019 వరల్డ్‌కప్‌ కోసం రాయుడును కాదని విజయ్ శంకర్ ని తీసుకున్నారు అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. దీంతో మనస్తాపం చెందిన రాయుడు సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు గుప్పించాడు. అదే బాధలో జట్టుకు కూడా గుడ్‌బై చెప్పేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా