Pathaan: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.110లకే మల్టీప్లెక్స్‌లో షారుఖ్‌ ‘పఠాన్‌’ సినిమా.. ఆ ఒక్కరోజు మాత్రమే

గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న పఠాన్‌ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పఠాన్‌ సినిమా రూ.970 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది.

Pathaan: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.110లకే మల్టీప్లెక్స్‌లో షారుఖ్‌ 'పఠాన్‌' సినిమా.. ఆ ఒక్కరోజు మాత్రమే
Pathaan Movie
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:18 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ‘పఠాన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెకెక్కించిన ఈ స్పై అండ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. కండల వీరుడు జాన్‌ అబ్రహం విలన్‌గా మెప్పించాడు. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న పఠాన్‌ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పఠాన్‌ సినిమా రూ.970 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. అందులో ఒక్క ఇండియాలోనే రూ.605 కోట్లు కాగా ఓవర్సీస్‌లో రూ.365 కోట్లు రాబట్టడం విశేషం. కాగా పఠాన్‌ సినిమా కలెక్షన్లకు వెయ్యికోట్లకు చేరువలో ఉన్న సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ప్రొడక్షన్‌ మూవీ లవర్స్‌కు ఒక శుభవార్త చెప్పింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 17)న దేశ వ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్స్‌లలో రూ. 110కే ఈ సినిమాను పఠాన్‌ సినిమాను ప్రదర్శించనున్నట్టు ప్రకటించింది.

ఈ ఆఫర్‌ ప్రకారం సాధారణ థియేటర్లతోపాటు పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపోలిస్‌ వంటి అన్ని మల్టీప్లెక్స్‌లోనూ రూ. 110 రూపాయలకే పఠాన్‌ చూడవచ్చు. కాగా సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెత్‌తో తెరకెక్కిన పఠాన్‌ సినిమా డిజిటిల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.100 కోట్ల డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న పఠాన్‌ సినిమా మార్చి మూడో వారంలో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..