ఈ ఫొటోలోని హీరోయిన్‌ ఒకప్పుడు కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌.. ఇప్పటికీ వన్నె తగ్గని అందం.. ఎవరో గుర్తుపట్టారా మరి?

ఈ ఫొటోలో ఉన్నది ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌.. పేరుకు మలయాళీ అయినా పక్కా తెలుగమ్మాయిలా కనిపిస్తుంటుంది. బాలకృష్ణ, శ్రీకాంత్‌, జగపతిబాబు వంటి సీనియర్‌ హీరోలతో పాటు పవన్‌కల్యాణ్‌, రవితేజ, గోపిచంద్‌ వంటి క్రేజీ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది.

ఈ ఫొటోలోని హీరోయిన్‌ ఒకప్పుడు కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌.. ఇప్పటికీ వన్నె తగ్గని అందం.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2023 | 12:33 PM

ఈ ఫొటోలో ఉన్నది ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌.. పేరుకు మలయాళీ అయినా పక్కా తెలుగమ్మాయిలా కనిపిస్తుంటుంది. బాలకృష్ణ, శ్రీకాంత్‌, జగపతిబాబు వంటి సీనియర్‌ హీరోలతో పాటు పవన్‌కల్యాణ్‌, రవితేజ, గోపిచంద్‌ వంటి క్రేజీ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. అందం, అభినయం పరంగా తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. అయితే సినిమాల్లో బిజీ ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆతర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. . దాదాపు దశాద్ద కాలం పాటు తెలుగు పరిశ్రమను దూరమయ్యిందామె. అయితే సినిమాలపై మక్కువతో మళ్లీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇప్పటికే పలు సినిమాలకు కూడా సైన్‌ చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటుందీ అమ్మడు. నిత్యం తన గ్లామరస్‌ అండ్ ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. పై ఫొటో కూడా అలాంటిదే. ఇంతకీ చేతులు అడ్డం పెట్టుకుని మరీ మురిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు..

టాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ మీరా జాస్మిన్‌. ఇవాళ (ఫిబ్రవరి15) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేస్తున్నారు. కాగా తన పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది మీరా. తెలుగు, తమిళ భాషల్లో విమానం పేరుతో రూపొందుతున్న సినిమాలో మీరా కీలక పాత్ర పోషించనుంది. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ రోజు మీరా జాస్మిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ తెలుగు, తమిళ ద్విభాషా సినిమాను ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..