Jagapathi Babu: జగపతిబాబు ఇక తాత అవ్వలేడు.. పెద్ద కూతురు అలా.. చిన్న కుమార్తె ఇలా…
పిల్లల పెంపకంపై మాట్లాడిన జగపతి బాబు వాళ్లపట్ల బాధ్యత తీసుకోవడం అనేదే రాంగ్ అంటున్నారు. ఎలా బతకాలి అనే స్వేచ్ఛ వారికే వదిలేయాలని ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నారు.
పెళ్లి.. అనేది జీవితానికి అవసరమా..? దీనిపై ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయ్. నూటికి 95 మంది పెళ్లి చేసుకోవాలనే చెబుతారు. కానీ ఈ మధ్య కాలంలో యూత్ మైండ్ సెట్ మారిపోయింది. సర్దుబాట్లు, సమస్యలతో కూడిన బంధాలలోకి అడుగుపెట్టే బదులు.. సోలో లైఫే సో బెటర్ అనేస్తున్నారు నేటితరం యువత. పెళ్లి అయితే చాలా విషయాల్లో ఫేక్‌గా బ్రతకాల్సి వస్తుందని.. ఆ బాధ మాకు వద్దు అని దాపరికం లేకుండా అందరి ముందే చెప్పేస్తున్నారు. ఆర్జీవీ, పూరి లాంటోళ్లు పెళ్లి చేస్కుంటే నీ బతుకు బస్టాండే అని డైరెక్ట్‌గా చెప్పేస్తారున్నారు. నటుడు జగపతి బాబు సైతం ఇదే విషయాన్ని కాస్త సాఫ్ట్ వేలో చెబుతున్నారు. తొలి నుంచి ఆయన ధోరణి భిన్నం.. ప్రాక్టికల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటారు. ఆయన పెద్ద కూతరు అమెరికన్‌ని ప్రేమిస్తే.. మరో మాట అడక్కుండా.. దగ్గరుండి పెళ్లి చేశారు. పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నానని చెబితే.. ఆమె నిర్ణయాన్ని స్వాగతించినట్లు జగపతిబాబు తెలిపారు. తను ఇప్పుడు పెట్స్ పెంచుకుంటుందని.. చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
చిన్నకూతురుకి అయితే తాను పెళ్లి చేయనని చెప్పేశారట జగ్గూ భాయ్. తానైతే బలవంతం చేయను.. అది తన ఒపినియన్ అని.. ఒకవేళ ఎవర్నైనా వెతుక్కుని పెళ్లి చేస్కుంటానంటూ వస్తే మాత్రం.. వద్దు అనను అని చెప్పారు. కూతురుకు పెళ్లి చేయాలనేది బాధ్యత అని నేను అస్సలు ఫీల్ అవ్వను అని చెప్పుకొచ్చారు. పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దులిపేసుకునే స్వార్థమని చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్. పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ప్రస్తుత సమాజంలో విడాకులు కామన్ అయిపోయాయని.. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం కన్నా.. కనకపోవడమే బెస్ట్ అంటూ మైండ్ హీటెక్కే కామెంట్స్ చేశారు. పిల్లలతో ఫ్రెండ్స్‌లా ఉండాలని చెప్పిన ఆయన.. పెద్దయ్యాక వాళ్లు ఎలా బతకాలన్నది వాళ్లకే వదిలేయాలని చెబుతున్నారు.
ఇద్దరు కుమార్తెలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అంటే.. అయితే ఎంత.. అవ్వకపోతే ఎంత తొక్క.. అని సిల్లీగా కొట్టి పడేశారు. ఏదైనా బాబులో ఈ లెవల్ మెచ్యూరిటీ చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..