AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అచ్చం సూర్యకుమార్‌లా.. 360 డిగ్రీస్‌లో కళ్లు చెదిరే షాట్లు ఆడుతోన్న బాలిక.. లేడీ స్కైకు సచిన్ ఫిదా

క‌ళ్లు చెదిరే షాట్లు ఆడుతూ టీమిండియా విధ్వంసక ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను తలపిస్తోంది. ఈ అమ్మాయి ఆటతీరుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ సెక్రటరీ జైషా తదతర ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు.

Viral Video: అచ్చం సూర్యకుమార్‌లా.. 360 డిగ్రీస్‌లో కళ్లు చెదిరే షాట్లు ఆడుతోన్న బాలిక.. లేడీ స్కైకు సచిన్ ఫిదా
Surya Kumar Yadav
Basha Shek
|

Updated on: Feb 14, 2023 | 8:46 PM

Share

భారత మహిళల క్రికెట్‌లో కొత్త విప్లవం వచ్చింది. WPL 2023 వేలం సోమవారం (ఫిబ్రవరి14) అట్టహాసంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో ఇందులో చాలా మంది మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. అత్యంత ఖరీదైన క్రీడాకారిణి స్మృతి మంధానను బెంగళూరు 3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అలాగే దీప్తిశర్మ, హర్మన్‌ప్రీత్‌కౌర్‌, షెఫాలీవర్మ తదితర స్టార్‌ ప్లేయర్లు కూడా భారీ ధరకు ఎంపికయ్యారు. ఇప్పుడు వీరి బాటలోనే పయనించేందుకు రెడీ అవుతోంది ఓ 14 ఏళ్ల బాలిక. క‌ళ్లు చెదిరే షాట్లు ఆడుతూ టీమిండియా విధ్వంసక ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను తలపిస్తోంది. ఈ అమ్మాయి ఆటతీరుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ సెక్రటరీ జైషా తదతర ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. రాజ‌స్థాన్‌లోని బ‌ర్మార్‌కు చెందిన మూమ‌ల్ మెహ‌ర్ అనే 14 ఏళ్ల అమ్మాయి అచ్చం సూర్య‌కుమార్‌లా షాట్లు ఆడుతోంది. బౌలింగ్‌ చేస్తున్నది ఎవరన్నది పట్టించుకోకుండా ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా 360 డిగ్రీస్‌లో నలుదిక్కులా షాట్లు ఆడుతోంది.

నలుదిక్కులా షాట్లు ఆడుతూ..

ముమల్‌​ విన్యాసాలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లేడీ స్కై అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ముమల్‌ విన్యాసాలకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఫిదా అయ్యాడు. సచిన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా? అత్యద్భుతం.. ముమల్‌ బ్యాటింగ్‌ విన్యాసాలను నిజంగా ఎంజాయ్‌ చేశాను’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ అమ్మాయి కళ్లు చెదిరే షాట్లను చూసిన బీసీసీఐ సెక్రటరీ జై షా .. ‘ఒక చిన్న అమ్మాయి క్రికెట్ నైపుణ్యాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మహిళల క్రికెట్‌ కు మంచి భవిష్యత్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. రేపటి గేమ్ ఛేంజర్‌లుగా మారేందుకు మన యువ క్రీడాకారులను శక్తివంతం చేసేందుకు కలిసి పని చేద్దాం’ అని ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు జైషా.

ఇవి కూడా చదవండి

ఇక ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సైతం ముమల్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. భవిష్యత్తులో ముమల్‌ టీమిండియా జెర్సీ ధరించే స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలని ఆమె రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను అభ్యర్ధించారు. ఇలా మొత్తానికి సోషల్‌మీడియాలో ట్రెండింగవులతోంది ముమల్‌ వీడియో.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..