Navdeep: బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పనున్న హీరో నవదీప్!! ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌తో సర్‌ప్రైజ్!
వదీప్ త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వాలంటైన్స్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతను షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలాన్నిస్తోంది.
టాలీవుడ్‌లో ఉన్న ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లిస్ట్‌లో హీరో నవదీప్ కూడా ఒకరు. ఇంకా స్టిల్ సింగిల్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తోన్న ఈ ట్యాలెంటెడ్ హీరో అసలు తనకు పెళ్లి ఉద్దేశ్యమే లేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నా తాను మాత్రం పట్టించుకోవట్లేదంటూ ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్నాడు. అయితే నవదీప్ త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వాలంటైన్స్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతను షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా ఓ అమ్మాయి సిగ్గుతో తన మొహాన్ని దాచుకుని సిగ్గుపడుతూ, ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఫొటోను షేర్ చేశాడు నవదీప్. దీనికి ఖుషీ అహుజా అని పేరు కూడా ట్యాగ్ చేశాడు. కానీ ఆ ట్యాగ్‌తో ఇన్ స్టాగ్రాంలో ఫోటోలు ఏమీ కూడా కనిపించడం లేదు. చూస్తుంటే జనాలను బక్రా చేసేందుకు అలా చేశాడా? అన్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఆ అమ్మాయిని నవదీప్ పెళ్లి చేసుకోబోతోన్నాడా?.. ఆమెతో నిశ్చితార్థం జరిగిందా? అందుకే ఈ పోస్ట్ షేర్ చేశాడా? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే ఖుషి ఆహుజా అనే అమ్మాయి పేరు ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులేమీ కనిపించడం లేదు. దీంతో అందరినీ ప్రాంక్ చేసేందుకు నవదీప్ అలా పోస్ట్ చేశాడని కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై అతను క్లారిటీ ఇస్తేనే తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే బిగ్ బాస్ తొలి సీజన్ లోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం అతను లవ్ మౌళి అనే సినిమాతో పాటు న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..