Renu Desai: డియర్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.. గెట్‌వెల్‌ సూన్ .. ఆటుపోట్లు ఎన్నో దాటావ్‌గా

మాటల్లో మాధుర్యం... చేతల్లో చైతన్యం.. వ్యక్తిత్వంలో వికాసం... ఆమె సొంతం. అందుకే పరిస్థితులు ఎదురుతిరిగినా ఆమె మాత్రం గట్టిగా నిలబడింది. సూటిగా ముందుకే నడిచింది. కానీ.. ఎందుకో ఒక్క క్షణం ఆగిపోయింది. నాకే ఎందుకిలా అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆమెనలా కలవరపాటుకు గురిచేసిన విషయమేంటి.. పవర్‌స్టార్ మాజీ లైఫ్‌ పార్టనర్ రేణుదేశాయ్‌కి ఏమైంది?

Renu Desai: డియర్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.. గెట్‌వెల్‌ సూన్ .. ఆటుపోట్లు ఎన్నో దాటావ్‌గా
Renu Desai
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2023 | 11:23 AM

టోటల్లీ షీ ఈజ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అరుదైన వ్యక్తిత్వం, విశాల దృక్పథం ఉన్న కలర్‌ఫుల్ సెలబ్రిటీ రేణు దేశాయ్. పుట్టుకతో మరాఠీ అమ్మాయే ఐనా తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలీనివాళ్లు లేరు. పవర్‌స్టార్ లైఫ్ కంపానియన్‌గా ఆమెకున్న క్రేజే వేరు. దాదాపు పాతికేళ్ల కిందట తెలుగు సినిమా ప్రేక్షకుడికి పరిచయమై… ఆ తర్వాత తెలుగింటి కోడలుగా మారి… తన కేరాఫ్‌ని భాగ్యనగరానికి మార్చుకున్న రేణు దేశాయ్‌కి… ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు, వైవాహిక జీవితంలోనూ బోలెడన్ని ఆటుపోట్లు. ఆవిధంగా ఎదురీత ఆమెకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఒక గాఢమైన సందేశంతో మళ్లీ అభిమానుల గుండెల్ని బరువెక్కించారు రేణుదేశాయ్.

అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలిసిన తన అనారోగ్యం గురించిన టాప్‌ సీక్రెట్స్‌ బైటపెట్టుకున్నారు రేణు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా… దాన్ని ఫేస్ చెయ్యడానిక్కావల్సిన శక్తిని ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటున్నా… అంటూ ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్… వైరల్‌గా మారింది. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చారు రేణుదేశాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడండి… ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసింది. నవ్వుతూ వాటి కోసం ఎదురుచూద్దాం అంటూ ఆమె రాసుకున్న ఇన్‌స్పిరేటివ్ వర్డ్స్‌… నెటిజన్లను కదిలించేస్తున్నాయి.

ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా… మందులు వాడుతున్నా… యోగా చేస్తున్నా. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటా… అంటూ రేణూ దేశాయ్‌ తన రుగ్మతను, దాని తీవ్రతను చెప్పకనే చెప్పేశారు. ఆమె ఒంటిమీదున్న డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్‌ని గమనిస్తే… రేణు ఎటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హోల్టర్ మానిటర్ అనే పరికరంతో నడుస్తున్నారు రేణు. అసలేమిటీ హోల్టర్ మానిటర్… ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు దీన్ని రిఫర్ చేస్తారు… అని లోతుగా ఆరా తియ్యడం మొదలైంది. గుండె గుట్టును రట్టు చేసే పరికరం పేరే హోల్టర్ మానిటర్. ఛాతీ మీద 24 గంటల పాటు అమర్చే ఈ పరికరం ద్వారా గుండె కొట్టుకునే విధానాన్ని నిరంతరాయంగా రికార్డ్ చెయ్యొచ్చు. గుండె లయ తప్పినా, కొట్టుకునే వేగం తగ్గినా ఇందులో ఈజీగా తెలిసిపోతుంది.

Renu

గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి ప్రాధమికంగా చేసే పరీక్షలు ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్, యాంజియోగ్రామ్. ఇవన్నీ చేయించుకున్నప్పటికీ అన్నీ నార్మల్‌గానే ఉన్నట్టు కనిపించినా… అంతర్గతంగా ఉండే సమస్యలతో గుండెపోటొచ్చే ఛాన్సుంది. గుండె లోపల పూడికలు, రంధ్రాలు ఉండిపోయి ప్రమాదకరంగా మారతాయి. దాన్ని నివారించడానికే పేషెంట్ ఛాతీ మీద 24 హోల్టర్ మానిటర్ అమర్చి… గుండెపై నిఘా పెడతారు డాక్టర్లు. ప్రస్తుతం రేణుదేశాయ్‌కి అదే జరుగుతోందట. డయాబెటిక్, బ్లడ్ ప్రెజర్ లాంటివి లేకపోయినా గుండెజబ్బుకు దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్‌ రేణుదేశాయ్‌కి చాలా ఉన్నాయని, ఆమె పడుతున్న మానసిక ఒత్తిడి ఆమెను గుండె జబ్బు బారిన పడేసిందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమస్యతో ఎన్నిరోజులుగా పోరాడుతున్నారో తెలీకపోయినా… స్ట్రెస్ నుంచి బైటపడ్డానికి ఆమె చేస్తున్న శ్రమను మాత్రం ఫాలోయర్లు గమనిస్తూనే ఉన్నారు. పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి ఔటింగ్ వెళతారు… తనకిష్టమైన సినిమా మేకింగ్‌తో బిజీగా ఉంటారు.

ఇటీవలే అన్నదాత వ్యథలపై షార్ట్ ఫిలిమ్ తీశారు. ఇష్క్‌వాలా అనే మరో చిన్న సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. టెలివిజన్ షోకి హోస్ట్‌గా కూడా కనిపించిన రేణుదేశాయ్… రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు మూవీలో నటిస్తూ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇంతలోనే… ఆమె అనారోగ్యంతో బాధపడుతోందన్న వార్త… ఫిలిమ్ అండ్ సోషల్ సర్కిల్స్‌ని కలచివేస్తోంది. కమాన్ రేణు… గెట్‌వెల్‌ సూన్ అంటూ మెసేజెస్‌తో హోరెత్తిస్తున్నారు ఆమె నియర్ అండ్ డియర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!