- Telugu News Photo Gallery Cinema photos 'Tridev' actress Sonam on comeback: Started working at 14, got pregnant at 19 says Sonam
19 ఏళ్లకే గర్భందాల్చా.. దేశం వదిలి వెళ్లిపోయాను: నటి ఆసక్తికర వ్యాఖ్యలు
త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనమ్ అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ ఓటీటీ షోతో ఆడియన్స్‌ను అలరించేందుకు రీఎంట్రీ..
Updated on: Feb 16, 2023 | 4:27 PM

త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనమ్ అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ ఓటీటీ షోతో ఆడియన్స్‌ను అలరించేందుకు రీఎంట్రీ ఇస్తోంది. సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు ఆభిమానులతో పంచుకుంది.

లాక్‌డౌన్‌లో ఓటీటీలో షోలు, సిరీస్‌లు చూశాక ఇలాంటివి నేనెందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. 2018 తర్వాత బరువు పెరగడం ప్రారంభించాను. వెంటనే ముప్పై కిలోలు తగ్గి 32 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

పద్నాలుగేళ్లకే పని చేయడం ప్రారంభించా 19వ ఏటనే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చవిచూశాను. జీవితమన్నాక అన్నింటినీ దాటుకుంటూ పోవాలి

యాబై ఏళ్లకే జీవితం ముగియదు. చేయవల్సింది చాలా ఉంది. నా లుక్‌కు తగ్గ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. మన దేశంలో 50 ఏళ్ల వయస్సు వచ్చాక మహిళలు తమ గుర్తింపును కోల్పోతున్నారు. నా ముఖంపై ముడుతలకు నేను భయపడను. నా శరీరాకృతికి తగ్గ పాత్రల్లో నటిస్తాను.

1990లో విడుదలైన అజూబా తర్వాత నటనకు దూరంగా ఉన్నా. 1997లో ఇండియను వదిలి వెళ్లిపోయాను. ఇన్నాళ్లకు కొత్త తరంతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని నటి సోనమ్ చెప్పుకొచ్చింది.





























