తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎవర్‌ గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తొలిప్రేమ సినిమాలో చెల్లెలిపాత్రతో అదరగొట్టింది వాసుకి. ఆ సినిమాలో పవన్‌- వాసుకీ కాంబినేషన్‌లోని సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తే.. మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి.

తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Actress Vasuki
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2023 | 8:33 AM

నటి వాసుకి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే వెంటనే గుర్తుపడతారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎవర్‌ గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘తొలిప్రేమ సినిమాలో చెల్లెలిపాత్రతో అదరగొట్టింది వాసుకి. ఆ సినిమాలో పవన్‌- వాసుకీ కాంబినేషన్‌లోని సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తే.. మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో తనకి ఇష్టం లేకపోయినా తనని ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాసుకీ. ఇక్కడ పవన్‌తో ఆమె చెప్పే సెంటిమెంట్‌ డైలాగులు అందరికీ గుర్తుండిపోయాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకీ వన్‌ ఫిల్మ్‌ వండర్‌లా ఒక్క సినిమాకే పరిమితమైంది. తొలిప్రేమ షూటింగ్ సమయంలోనే ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ పవన్‌ కల్యాణ్‌ మిత్రుడు, ఆనంద్ సాయితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది వాసుకీ.

కాగా వాసుకీ- ఆనంద్‌ సాయి దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. హర్షిత అనే కూతురు, సందీప్‌ అనే కుమారుడు ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయిన వాసుకీ ఇప్పుడు ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇద్దరి పిల్లల ఆలనాపానాలోనూ బిజీగా ఉంటోంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తన పిల్లల ఫొటోలను షేర్‌ చేస్తోంది. అలాగే తన టూర్‌, వెకేషన్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. కాగా తొలి ప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్ దగ్గర నుంచి.. తమ్ముడు, ఖుషీ, జల్సా ఇలా వరుసగా పవన్ సినిమాలకు ఆర్డ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు ఆనంద్ సాయి. ఇక తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిర్మాణంలో కూడా ఆనంద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి పునఃనిర్మాణంలో కూడా ఆనంద్‌ సాయి కీ రోల్‌ పోషించనున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vasuki Anand (@vasukianand)

View this post on Instagram

A post shared by Vasuki Anand (@vasukianand)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే