Chetan Sharma: స్టింగ్‌ ఆపరేషన్‌లో చెత్త వాగుడు.. చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి చేతన్ శర్మ రాజీనామా.. ఆమోదించిన బీసీసీఐ

స్టింగ్‌ ఆపరేషన్‌లో టీమిండియా క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా వెంటనే చేతన్‌ రాజీనామాను ఆమోదించారు.

Chetan Sharma: స్టింగ్‌ ఆపరేషన్‌లో చెత్త వాగుడు.. చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి చేతన్ శర్మ రాజీనామా.. ఆమోదించిన బీసీసీఐ
Chetan Sharma
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2023 | 11:30 AM

స్టింగ్‌ ఆపరేషన్‌లో టీమిండియా క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా వెంటనే చేతన్‌ రాజీనామాను ఆమోదించారు. కాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్‌ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌ హోదాలో ఉండి బీసీసీఐ పెద్దలతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కోహ్లీ, గంగూలీల మధ్య విభేదాలపై చేతన్‌ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించాయి. గంగూలీ ఒక్కడే కాదని, తమ బోర్డు మొత్తం విరాట్‌కు వ్యతిరేకంగా ఉందని శర్మ చెప్పుకొచ్చాడు.  అంతేకాదు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని.. అవి డోపింగ్‌ టెస్ట్‌కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ.. సంచలన కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో చేతన్  వ్యాఖ్యలపై బీసీసీఐతో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా గుర్రుగా ఉన్నారు.

టీమిండియా తరపున 23 టెస్టులు ఆడిన చేతన్ శర్మ, కొన్ని నెలల క్రితమే  సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్‌గా నియమితులయ్యాడు. అయితే నోటి దూల కారణంగా కొన్ని రోజులకే పదవిని కోల్పోవాల్సి వచ్చింది.  కాగా స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై పలు ఆరోపణలు చేశాడు. కోచ్‌లు రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లిలతో జరిగిన రహస్య సంభాషణలను కూడా బయటపెట్టాడు. 80 నుంచి 85 శాతం ఫిట్‌గా ఉన్నప్పటికీ ఆటగాళ్లు త్వరగా క్రికెట్‌లోకి రావడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని శర్మ ఆయన ఆరోపించారు. అంతేకాదు సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20ఐ సిరీస్‌కు బుమ్రా తిరిగి రావడంపై తనకు, జట్టు మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..